బొత్స ప్లాన్ అదుర్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-07 16:24:30

బొత్స ప్లాన్ అదుర్స్

విజ‌యన‌గ‌రం జిల్లాలో కీల‌క నేత‌గా ఉన్నారు బొత్స స‌త్యనారాయ‌ణ... కాంగ్రెస్ లో మంత్రిగా ఉండి విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చక్రం తిప్పిన నాయ‌కుడు... ఇక స‌మైఖ్యాంద్రా ఉద్య‌మ స‌మ‌యంలో విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఆయ‌న పై మ‌రింత తీవ్ర వ్య‌తిరేక‌త పెరిగింది.. 
 
2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసి క‌నివీనిఎరుగ‌ని రీతిలో కాంగ్రెస్ పై అంత వ్య‌తిరేఖ‌త ఉన్నా, చీపురుప‌ల్లిలో  రెండోస్దానంలో నిలిచారు... ఇక ఎమ్మెల్యేగా మృణాళిని గెల‌వ‌గా మంత్రిప‌ద‌వి కూడా ఆమె పొందారు.. ఇక సెగ్మెంట్లో కాంగ్రెస్ నుంచి చాలా మంది ఆయ‌న కేడ‌ర్.... వైసీపీ తెలుగుదేశంలో స‌ర్దుకున్నారు... త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న‌యుడు వైయ‌స్ జ‌గ‌న్ తో చ‌ర్చించి ఆయ‌న వైసీపీలో చేరారు.
 
ఆయ‌న ఇటీవ‌ల త‌న జోరు పెంచారు అనే చెప్పాలి... జ‌గ‌న్ పాద‌యాత్ర ఇక ఉత్త‌రాంధ్రా వ‌చ్చేస‌రికి బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న బొత్స స‌త్యనారాయ‌ణ, ప‌లువురిని వైసీపీలో చేర్చాలి అని తొలిరోజే గ్రాండ్ గా స‌భ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు అని తెలుస్తోంది... ఆయన ఇటీవ‌ల రాజ‌కీయంగా మ‌రింత పావులు క‌దులుపుతున్నారు. ఆయ‌న వెంట రెండుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఉన్న కేడ‌ర్ అంతా ఇప్పుడు తిరిగి తెలుగుదేశం నుంచి వైసీపీ వైపు వ‌స్తోంది... ఆయ‌న కూడా పార్టీలోకి రావాలి అనుకునే వారిక రెడ్ కార్పెడ్ ప‌ర్చుతున్నారు... మ‌రో ప‌క్క చీపురుప‌ల్లి లో తెలుగుదేశం రాజకీయం ర‌చ్చ‌కెక్కింది అనే చెప్పాలి.
 
ప్ర‌స్తుత ఎమ్మెల్యే మృణాళిని, మాజీ ఎమ్మెల్యే  గద్దె బాబురావు, మాజీ నియోజ‌క‌వర్గ ఇంచార్జ్  త్రిమూర్తులుకు !!కేటీఆర్ !! మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతోంది... ఇక మంత్రి ప‌ద‌వి ఆమె కోల్పోయిన త‌ర్వాత మ‌రింత వివాదాలు వ‌చ్చాయి సెగ్మెంట్లో...ఇక్క‌డ కేడ‌ర్ లో కూడా ముగ్గురు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు తీసుకోవ‌డంతో ఎవ‌రి వెంట ఉండాలో తెలియ‌ని ప‌రిస్దితి ఏర్ప‌డింది.. ఈ స‌మ‌యంలో ఒక‌రి వెంట ఉండి  మ‌రో ఇద్ద‌రి మ‌న‌సు నొప్పించ‌డం ఎందుకు అని కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు... అయితే బొత్స ఈ రూట్లో స‌క్సెస్ అవుతున్నారు... త‌న నాయ‌కత్వ చ‌తుర‌త‌తో గ‌తంలో ఎలాచక్రం తిప్పారో అలాగే ముందుకు వెళుతున్నారు ఆయ‌న‌.
 
ఇక ప్రెస్ మీట్లు పెట్టి మ‌రీ క్ష‌మాప‌ణలు కోరుకుని డిమాండ్ చేసే స్దితికి టీడీపీ నాయ‌కులు గ‌తంలో చేర‌డంతో తెలుగుదేశం ప‌రిస్దితి ఇక్క‌డ మ‌రింత ద‌య‌నీయంగా మారింది అనే చెప్పాలి. ఇక్క‌డ ద్వితీయ స్ధాయి కేడ‌ర్ ను ఎవ‌రు త‌మ వ‌ర్గంగా చేసుకుంటారో వారికే ప‌గ్గాలు వారికే అధికారాలు... దీంతో మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ దూసుకుపోతున్నారు.... ద్వితీయ స్ధాయి కేడ‌ర్ ను పార్టీలోకి తీసుకుని ముందుకు వెళుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.