ఆ విష‌యంలో బాబు మించిన నాయ‌కుడు లేరు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-07-24 05:14:17

ఆ విష‌యంలో బాబు మించిన నాయ‌కుడు లేరు

తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల విష‌యంలో  ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు బీజేపీతో లాలూచీ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు.
 
ఈ రోజు విశాఖ‌ప‌ట్నంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ,  ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ సీపీ నాయ‌కులు ప్ర‌త్యేక వాదాన్ని ప్ర‌స్తావిస్తుంటే  ఆ విష‌యాన్ని నాలుగు సంవ‌త్స‌రాల నుంచి టీడీపీ నాయ‌కులు భూ స్థాపితం చేసేందుకు అన్నివిధాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
 
అయితే ఇదే క్ర‌మంలో త‌మ నాయుకుడు కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా బంద్ ను నిర్వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ స‌ర్కార్ పోలీసుల‌తో అక్ర‌మంగా అరెస్ట్ ల‌ను చేయించింద‌ని బొత్స తీవ్ర‌ స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో ఒక వ్య‌క్తి మ‌ర‌ణించాడ‌ని నిప్పులు చెరిగారు. అయితే ఆ వ్య‌క్తి మ‌ర‌ణానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడే కార‌ణమ‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ప్ర‌శాంతంగా బంద్ ను పాటిస్తున్న వైసీపీ నాయ‌కులను చంద్ర‌బాబు ఎందుకు అరెస్ట్  చేయించారో మీడియా ద్వారా వివ‌రించాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.
 
కొద్ది రోజుల క్రితం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఏపీకి అన్యాయం జ‌రిగిందని ఈ అన్యాయానికి వ్య‌తిరేకంగా రాష్ట్ర ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లు చెయ్యాల‌ని చెప్పార‌ని, అయితే ఈ రోజు వైసీపీ నాయ‌కులు బంద్ ను నిర్వ‌హిస్తే మాట మార్చి అక్ర‌మంగా త‌మ‌ను అరెస్ట్ చేయించార‌ని బొత్స మండిప‌డ్డారు. అవ‌స‌రాల‌ను బట్టి మాట మార్చ‌డంలో ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడును మించిన నాయ‌కుడు లేర‌ని విమ‌ర్శ‌లు చేశారు. 
 
గతంలో టీడీపీ నాయ‌కులు కేంద్రానికి వ్య‌తిరేకంగా దీక్ష‌లు చేస్తే ఈ దీక్ష‌కు అధికార బ‌లంతో విద్యార్థుల‌ను డ్వాక్రా మ‌హిళ‌ల‌ను బ‌స్సుల్లో తీసుకు వెళ్లార‌ని బొత్స మండిప‌డ్డారు. అయితే వారు చేసిన దీక్ష నిస్వార్ధం తో చేసిన దీక్ష‌కాద‌ని స్వార్థ రాజ‌కీయాల‌తో  దీక్ష‌ల‌ను చేశార‌ని విమ‌ర్శల చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.