బాబు పై బొత్స సీక్రెట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-25 17:49:16

బాబు పై బొత్స సీక్రెట్

ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై విరుచుకుప‌డ్డారు... ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబు కొత్త నాటాకాలకు తెర లేపుతున్నార‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ అరోపించారు... నాలుగు సంవ‌త్స‌రాలు కేంద్రంతో మిత్ర‌ప‌క్షం వ్య‌వ‌హ‌రించి  విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన హామీల‌ను సాధించ‌డంలో చంద్ర‌బాబు విఫ‌లం చెందార‌ని అన్నారు.. 
 
ఇక క‌ర్నాట‌క ఎన్నిక‌ల త‌ర్వాత చంద్ర‌బాబు అవినీతిపై, ఆయ‌న ప్రభుత్వం చేసిన అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం వెంట‌నే చర్యలు తీసుకోకపోతే ఆ రెండు పార్టీలు లాలూచీ పడినట్లేనని బొత్స ఆరోపించారు.. అయితే ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు త‌న న‌ల‌భై సంవ‌త్స‌రాల రాజ‌కీయ అనుభ‌వంతో మ‌రో ఎత్తుగ‌డ వేస్తున్నార‌ని అన్నారు..
 
ఈ ఎన్నిక‌ల త‌ర్వాత చంద్ర‌బాబు త‌న‌పై కేంద్రం ఎక్క‌డ కేసులు పెడుతుందోన‌ని భ‌య‌ప‌డి త‌న దూకుడు తగ్గించార‌ని బొత్స ఆరోపించారు.. నాటి నుంచి నేటి వ‌ర‌కు చంద్ర‌బాబు రాష్ట్ర అభివృద్ది కోసం కానీ ప్ర‌జ‌ల కోసం కానీ ఏనాడు ఆలోచించ‌లేద‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు.
 
అయితే చంద్ర‌బాబు చేసే ప్ర‌తి ప‌నిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, అలాగే టీడీపీ అధికారులు అవినీతి, అక్ర‌మాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని అన్నారు... కాగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు టీడీపీ కి త‌గిన బుద్ది చెబుతార‌ని బొత్స తెలిపారు...  త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కచ్చితంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయం అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.