ప‌వ‌న్ కు బొత్స సూటి ప్ర‌శ్న‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-28 04:56:40

ప‌వ‌న్ కు బొత్స సూటి ప్ర‌శ్న‌

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై సీరియ‌స్ అయ్యారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు విదేశీ పర్య‌ట‌న‌లు, పెట్టుబ‌డుల‌పై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని బొత్సా డిమాండ్ చేశారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విభ‌జ‌న హామీల‌పై స్పష్ట‌త ఇచ్చే పార్టీల‌కు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్ర‌త్యేక హోదా విష‌యంపై కేంద్ర,రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌శ్నించారు.

తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చేతినోప్పి పేరుతో కొత్త నాటకానికి సీఎం తెరతీశారని, దోచుకున్నది దాచుకోవడానికే చంద్రబాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నార‌ని బొత్స ఎద్దేవా చేశారు. బీజేపీపై బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను నెర‌వేర్చ‌డంలో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు విఫ‌లం అయ్యాయ‌ని బొత్సా అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.