ఎమ్మెల్యే పై ఫేస్ బుక్ లో పోస్టు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-05 16:06:43

ఎమ్మెల్యే పై ఫేస్ బుక్ లో పోస్టు

గుంటూరు జిల్లాలో పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి మాచ‌ర్ల ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు ....ప్ర‌జ‌ల్లో ఉండ‌టం జిల్లాలో ప్ర‌జా  జ‌గ‌న్ కు వెన్నంటి ఉండ‌టం, పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డికి ఫేం మ‌రింత పెరుగుతోంది. అయితే ఇప్పుడు ఇక్క‌డ సెగ్మెంట్లో ఓ తెలుగుదేశం నేత పెట్టిన పోస్టు పెద్ద వివాదానికి దారితీసింది.
 
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిపై జ‌గ‌న్ కాస్త గుర్రుగా ఉన్నారని, ఆయ‌న పై పోస్టు పెట్టాడు టీడీపీ ఇన్ చార్జ్ చ‌ల‌మారెడ్డి స‌న్నిహితుడు బ్ర‌హ్మారెడ్డి ...ఈ వివాదాస్ప‌ద పోస్టు  సెగ్మెంట్ అంతా పాకిపోయింది.. సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు దారితీసింది.
 
గ‌త ఎన్నిక‌ల్లో అవ‌కాశం ఇచ్చినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు జ‌గ‌న్ టికెట్ ఇచ్చే అవ‌కాశం లేదు అని, ఆయ‌న బ‌దులు వేరే వ్య‌క్తికి ఇక్క‌డ టికెట్ వ‌స్తుంది అని, ఆయ‌న స‌రిగ్గా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టుసాధించ‌లేక‌పోతున్నారు అనేలా పోస్టు పెట్టారు బ్ర‌హ్మారెడ్డి. ఈ పోస్టు వైసీపీ నాయ‌కులు రామ‌కృష్ణారెడ్డి దృష్టికి తీసుకురావ‌డంతో ఆయ‌న బ్ర‌హ్మారెడ్డి తండ్రికి ఫోన్ చేసి మీ అబ్బాయిని ఇలాంటి ప‌నులు చేయ‌వ‌ద్ద‌ని కోరార‌ట‌. 
 
అయితే త‌న తండ్రికి ఫోన్ చేసి త‌న‌ను చంపుతాను అని ఎమ్మెల్యే బెదిరించారు అని కేసు పెట్టాడు బ్ర‌హ్మారెడ్డి..  అంతేకాకుండా వాయిస్ రికార్డ్ ఉంద‌ని తెలియ‌చేశాడు..దీనిపై ఎమ్మెల్యే వివ‌ర‌ణ ఇచ్చారు ....తాను ఫోన్ చేసిన మాట వాస్త‌వం చంపుతాను అని చెదిరించ‌లేదు... వాయిస్ రికార్డు ఉంద‌ని చెబుతున్నారు కదా సాక్ష్యంగా చూపండి అని ఎమ్మెల్యే సీఐకి తెలియ‌చేశారు.
 
వీరారెడ్డికి ఫోన్ చేశాను దానికి కార‌ణం వీరారెడ్డి ఒకప్పుడు దాదాపు 20ఏళ్ల పాటు తనతోనే ఉండేవారని అందుకే ఆయ‌న‌కు తెలియ‌చేశాను అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి తెలియ‌చేశారు.. ఇక త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట దెబ్బ‌తీయ‌డానికి ప్ర‌య‌త్నించిన బ్ర‌హ్మారెడ్డి పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కేసు ఫైల్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.