బ్రేకింగ్ క్షీణించిన మ‌రో వైసీపీ ఎంపీ ఆరోగ్యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycpmp
Updated:  2018-04-08 13:43:00

బ్రేకింగ్ క్షీణించిన మ‌రో వైసీపీ ఎంపీ ఆరోగ్యం

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్ర‌త్యేక హోదాకోసం ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ లో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.. ఈ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష నేటితో మూడ‌వ రోజుకు చేరుకుంది... రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం  ప‌ట్టిన ప‌ట్టు వీడ‌కుండా త‌మ ప్రాణాలు సైతం లెక్క‌చేయ‌కున్నారు వైసీపీ ఎంపీలు....దీంతో వారి ఆరోగ్యం క్ర‌మ‌క్ర‌మంగా క్షీణిస్తుంద‌ని డాక్ట‌ర్లు చెపుతున్నారు... అయితే ఇప్ప‌టికే నెల్లూరు ఎంపీ మేక‌పాటి ఆరోగ్యం క్షీణించి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా తిరుప‌తి ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ ఆరోగ్యం కూడా క్షీణించింద‌ని డాక్ట‌ర్లు తెలిపారు.. ఈ రోజు నుంచి ఆయ‌న వెంట‌నే దీక్ష విర‌మించాల‌ని లేక‌పోతే ఆరోగ్యం బాగా క్షీణిస్తుంద‌ని వైద్యులు తెలుపుతున్నారు.. కానీ తాను దీక్ష విర‌మించే ప్ర‌స‌క్తే లేద‌ని  ఈ దీక్ష‌లో త‌న ప్రాణాలు పోయినా ఫ‌ర్వాలేద‌ని తాను మాత్రం దీక్ష‌ను విర‌మించే ప్ర‌స‌క్తే లేద‌ని వ‌ర‌ప్ర‌సాద్  స్ప‌ష్టం చేశారు..
 
వైద్య ప‌రీక్ష‌లు జ‌రిపిన రామ్‌మనోహర్‌లోహియా వ‌ర‌ప్ర‌సాద్ ఆరోగ్యం బాగోలేద‌ని ఆయ‌న‌ను ఆసుప‌త్రికి తీసుకువెళ్తుంటే త‌మ‌కు స‌హ‌క‌రించ‌డంలేద‌ని పోలీసుల‌తో తెలిపారు... దీంతో పోలీసుల స‌హ‌కారంతో ఆయ‌న‌ను ఆసుప‌త్రికి తీసుకువెళ్లె ప్ర‌య‌త్నం చేస్తున్నారు డాక్ట‌ర్లు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.