జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు బ్రేక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-03 14:46:20

జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు బ్రేక్

ఏపీ ప్ర‌తిప‌క్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర 203 రోజుల‌ను పూర్తి చేసుకుని నేటితో 204వ రోజుకు చేరుకుంది. అయితే ఈ రోజు ఉద‌యం జర‌గాల్సిన పాద‌యాత్ర వ‌ర్షం కార‌ణంగా మ‌ధ్యాహ్నానికి వాయిదా వేశారు.ఇప్ప‌టికే జ‌గ‌న్ 2,477.7 కిలో మీట‌ర్ల‌ను పాద‌యాత్ర‌ను పూర్తి చేసి రాష్ట్ర రాజ‌కీయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. 
 
పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జ‌గ‌న్.ప్ర‌స్తుతం ఈ సంక‌ల్ప‌యాత్ర తూర్పు గోదావ‌రిజిల్లా రామ‌చంద్రాపురం నియోజ‌క‌వ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతుంది. ఇక తాజాగా ఈ రోజు ఉద‌యం చేప‌ట్టాల్సిన పాద‌యాత్ర భారీ వ‌ర్షం కార‌ణంగా మ‌ధ్యాహ్నానికి వాయిదా ప‌డింది.
 
పాద‌యాత్ర షెడ్యూల్ ప్ర‌కారం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని కాజులూరు మండలం కోలంక శివారు నుంచి ద్రాక్షారామం వ‌ర‌కు జననేత జ‌గ‌న్ పాద‌యాత్ర చేసి అక్క‌డ భారీ బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ వ‌ర్షం కార‌ణంగా ఈ బ‌హిరంగ‌స‌భ‌ను రేప‌టికి వాయిదా వేసిన‌ట్లు వైసీపీ నాయ‌కులు తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.