ప్రజా పోరాట యాత్రకి తాత్కాలిక బ్రేకులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-25 17:19:19

ప్రజా పోరాట యాత్రకి తాత్కాలిక బ్రేకులు

ప్రజాసమస్యల మీద పోరాడుతూ, ఎక్కడా తీరిక లేకుండా పర్యటనలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు విశ్రాంతి తీస్కుంటున్నారు. మొన్నటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నిడదవోలు, ఆచంట తదితర ప్రాంతాల్లో పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకుని, అధికారపక్షాన్ని, అక్కడి అధికారులని తూర్పారబెట్టారు పవన్ కళ్యాణ్. 
 
ఎప్పటినుండో  కంటి సమస్య ఇబ్బంది పెడుతున్నా పట్టించుకోకుండా రాష్ట్ర పర్యటన చేస్తున్న పవన్ కళ్యాన్ కి ఇప్పుడు ఆ సమస్య జఠిలం అయ్యి శస్త్ర చికిత్స కి దారి తీసింది. జంగారెడ్డిగూడెం లో వాతావరణం సహకరించకపోవడం తో బ్రేక్ తీసుకుని పవన్ హైదరాబాద్ కి చేరుకున్నారు.
 
సతి సమేతంగా తన అన్న మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకంక్షాలు తెలిపిన తర్వాత కంటి శస్త్ర చికిత్స నిమిత్తం "సెంటర్ ఫర్ సైట్ " బంజారా హిల్స్ లో ఉన్న కంటి ఆసుపత్రికి వెళ్లారు. నెల క్రితమే ఆపరేషన్ జరిగినా కూడా తీరిక లేకుండా పర్యటించడం వల్ల మళ్ళి మొదటికి వచ్చిందని ఇక నుండి తప్పని సరిగా విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పారు.
 
వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ని ఓడించడానికి కంకణం కట్టుకున్న పవన్ అతని ఆరోగ్య దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో తన పర్యటనకు బ్రేక్స్ వేసాడు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.