నేడు జ‌గ‌న్ పాద‌యాత్రకు బ్రేక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-28 16:00:24

నేడు జ‌గ‌న్ పాద‌యాత్రకు బ్రేక్

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర రాల‌య‌ల‌సీమలోని నాలుగు జిల్లాల‌ను, అలాగే కోస్తాలోని ఐదు జిల్లాల‌ను పూర్తి చేసుకుని తూర్పుగోదావ‌రి జిల్లా అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది.
 
ఈ సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ అధికార బ‌లంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రెండునాలుక‌ల దోర‌ణి వ్య‌వ‌హార శైలిని ప్ర‌జల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
ఇక తాజాగా ఈ సంక‌ల్ప‌యాత్ర గురువారం ర‌ద్దు అయింది. తూ.గో జిల్లాలో ఈ రోజు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాత‌వ‌ర‌ణ శాఖ తెలుప‌డంతో జ‌గ‌న్ పాద‌యాత్ర చేయ‌డానికి వీలు కుద‌ర‌కపోవ‌డంతో 201 రోజు పాద‌యాత్రకు విరామం ప్ర‌క‌టించారు. 
 
పాద‌యాత్ర షెడ్యూల్ ప్ర‌కారం ఈ రోజు ఉద‌యం నుంచి జ‌గ‌న్ భీమనపల్లి నుంచి పాద‌యాత్ర చేయాల్సి ఉంది. అయితే వ‌ర్షం కార‌ణంతో ఈ రోజు కొన‌సాగే పాద‌యాత్ర‌ను రేప‌టికి వాయిదా వేశారు. వాయిదా వేసినా కూడా ప్ర‌జ‌లు జ‌గ‌న్ ఉన్న నివాసానికి చేరుకుని ఫిర్యాదులు అధిక సంఖ్యలో అందిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.