బూచేప‌ల్లి రివ‌ర్స్ డైల‌మాలో మాధ‌వ‌రెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

buchepalli image
Updated:  2018-03-05 11:29:04

బూచేప‌ల్లి రివ‌ర్స్ డైల‌మాలో మాధ‌వ‌రెడ్డి

ప్ర‌కాశం జిల్లా ద‌ర్శిలో మ‌ళ్లీ రాజ‌కీయం మొద‌టికొచ్చింది.గ‌త ఆరు నెల‌లుగా జ‌గ‌న్ చెబుతున్నా స‌రే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ద‌ర్శి నుంచి పోటీ చేయ‌న‌ని మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద‌ర్ రెడ్డి జ‌గ‌న్ కు  ప‌లు సార్లు తెలియ‌చేశారు. పాద‌యాత్ర‌కు  రెండు రోజుల ముందు కూడా బూచేప‌ల్లి విష‌యంలో జిల్లా నాయ‌కులు అంద‌రితో జ‌గ‌న్  చ‌ర్చించారు. అయితే ఇప్పుడు తాజాగా ప్ర‌కాశం జిల్లాలో పాద‌యాత్ర స‌మ‌యంలో బూచేప‌ల్లి రివ‌ర్స్ అవుతున్నారు.
 
త‌న ఓట‌మికి గ‌త ఎన్నిక‌ల్లో కార‌ణం అయిన బాదం మాధ‌వ‌రెడ్డిని ఎలా జ‌గ‌న్ అభ్య‌ర్దిగా నియ‌మిస్తారు అని తన ఆవేద‌న‌ను పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న కేడ‌ర్ కు చెప్పి ఆవేద‌న ప‌డ్డారు...వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని కలిశారు.. జ‌గ‌న్ ఇటువంటి నిర్ణ‌యం తీసుకుంటారు అని తాను ఊహించ‌లేదు అని అన్నారు బూచేప‌ల్లి.. పాద‌యాత్ర స‌మ‌యంలో ఇలా ప్ర‌క‌టించ‌డం పై త‌మ కుటుంబానికి జ‌గ‌న్ ఇచ్చే గౌర‌వం ఇదేనా అని ఆయన మ‌ద‌న ప‌డ్డారు.
 
త‌ర్వాత ముండ్లమూరులోని అభిరామ్ బ్రిక్స్ ఇండస్ట్రీలో వద్ద దర్శి  నియోజకవర్గం లొని  5 మండలాల   కార్యకర్తలతో సమావేశం అయ్యారు  ఈ సందర్భంగా ఆయన  పార్టీ లో కష్టపడి పనిచేసిన, శాసనసభ సభ్యత్వం వదులుకొని వచ్చిన మా కుటుంబం మొత్తం జగన్ వెంట నడిచింది ,గత ఎన్ని కల్లో నా ఓట‌మికి కార‌ణం అయిన  వ్యక్తి కి  జగన్ టికెట్ ప్రకటన చేయడం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని అన్నారు.. అయితే రాష్ట్రంలో ఎవ‌రిని ఇంత‌లా జ‌గ‌న్ బ‌తిమాల‌లేదు కాని బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డికి ప‌లుసార్లు చెప్పి ఆయ‌న‌ను ఒప్పించాల‌ని జ‌గ‌న్  ప్ర‌యత్నించారు... ఆయ‌న పోటీ చేయ‌ను అని అన‌డంతోనే మాధ‌వ‌రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు అని, ఇలా అయితే కేడ‌ర్ ఎలా అక్క‌డ నిల‌బ‌డుతుంది అని వైసీపీ నాయ‌కత్వం కూడా మాట్లాడుతోంది. మ‌రి ఇప్పుడు బూచేప‌ల్లి రివ‌ర్స్ అవ‌డంతో మాధ‌వ‌రెడ్డి డైల‌మాలో ఉన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.