వైసీపీలో ఇక ఆ నాయ‌కుడు యాక్టీవ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

buchepalli  sivaprasad reddy active in ysr congress
Updated:  2018-03-02 11:49:17

వైసీపీలో ఇక ఆ నాయ‌కుడు యాక్టీవ్

ఇప్పుడు రాజ‌కీయాల ప్ర‌కారం ఎవ‌రికైనా టికెట్ ఇస్తాము అంటే, వారి ఆనందానికి అవ‌దులు ఉండ‌వు.. అలాగే  సీట్లు క‌న్ఫామ్ కాక, దాదాపు ఐదు సంవ‌త్స‌రాలు పార్టీ కోసం  క‌ష్ట‌ప‌డినా, ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి పార్టీ త‌ర‌పున  బీ ఫాం నాకు ఇవ్వ‌లేదు వేరే వారికి వ‌చ్చింది అని మ‌ద‌న ప‌డిన నాయ‌కులు ఉన్నారు.. అలాగే వారి  కేడ‌ర్ తో  క‌లిసి ఇండిపెండెంట్ గా నిల‌బ‌డే నాయ‌కులు ఉంటారు.. అయితే ఈ నాయ‌కుడు  మాత్రం దీనికి పూర్తి భిన్నం.
 
ప్ర‌కాశం జిల్లాలో ద‌ర్శి మాజీ ఎమ్మెల్యే  బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద‌రెడ్డి మాత్రం త‌న‌కు టికెట్ వ‌ద్దు అని, వేరే ఒక‌రిని చూసుకోవాలి అని మాత్రం జ‌గ‌న్ కు చెబుతూనే ఉన్నారు.. జ‌గ‌న్ మాత్రం ప్ర‌సాద‌రెడ్డినే నిల‌బ‌డ‌మ‌ని, త‌న‌కే టికెట్ కేటాయిస్తాను అని చెబుతున్నారు... జ‌గ‌న్ ఎన్నిసార్లు బ‌తిమ‌లాడినా, ఆయ‌న త‌న విధానం-  నిర్ణ‌యం మార్చుకోలేదు. దీంతో దర్శి వైసీపీ ఇన్‌చార్జ్‌గా బాదం మాధవరెడ్డిని జగన్ నియమించారు. అయినా వైసీపీ కేడ‌ర్ బూచేప‌ల్లి వెనుకే ఉంటోంది. మాధ‌వ రెడ్డిని వైసీపీ కేడ‌ర్ ఆద‌రించ‌డం లేదు అనే వార్త‌లు వినిపించాయి ద‌ర్శిలో.
 
వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే గెలుపు చాలా సులువన్నది స్ధానిక కేడ‌ర్ అభిప్రాయం. అయితే హఠాత్తుగా జగన్ పాదయాత్ర సందర్భంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డి తిరిగి యాక్టీవ్‌ కావడం అక్క‌డ పార్టీ నాయ‌కుల‌కు ఆనందం క‌లిగించింది... చీమకుర్తిలో జరిగిన జగన్‌ పాదయాత్రకు బూచేపల్లి భారీగా అనుచరులతో వచ్చి కలిశారు. ప్రతి నియోజకవర్గంలో జగన్ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు చూసుకుంటున్నారు. ఇక్కడ మాత్రం బూచేపల్లి శివప్రసాదరెడ్డి కూడా మాధ‌వ రెడ్డితో క‌లిసి ఏర్పాట్ల‌లో  చొరవ తీసుకున్నారు.. దీంతో బూచేప‌ల్లి త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారా అనే విధంగా జిల్లా నాయ‌క‌త్వం భావిస్తోంది..
 
అలాగే బూచేప‌ల్లి నిర్ణ‌యం మార్పు వ‌స్తుంది అని కూడా ఆశాభావంగా  నాయ‌కులు ఉంటున్నారు.. ఆయ‌న పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ వెంటే ఉన్నారు... ప్ర‌కాశంలో ఆయ‌న కుటుంబం జ‌గ‌న్ వెంట పాద‌యాత్ర‌లో పాల్గొంటోంది ఆయ‌న‌కు వెన్నంటి ప్ర‌కాశం పాద‌యాత్ర నుంచి బూచేప‌ల్లి అడుగులు వేశారు. దీంతో బూచేప‌ల్లి పై మ‌ళ్లీ వార్త‌లు వ‌స్తున్నాయి.. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ పై అభిమానంతోనే ఆయ‌న‌తో క‌లిసి న‌డుస్తున్నాన‌ని, గ‌తంలో పార్టీకోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తాను అని ఎలా చెప్పానో అదేవిధంగా క‌ష్ట‌ప‌డ‌తాన‌ని ఆయ‌న అంటున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.