బుద్దా గుండు స‌వాల్‌?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-11 18:16:42

బుద్దా గుండు స‌వాల్‌?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు ఎలా ఉన్నా ముఖ్యంగా నేత‌లు స‌వాళ్లు పెను ప్ర‌తీకార స‌వాళ్లు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు..వారికి పార్టీ త‌ర‌పున సీట్లు వ‌స్తాయో లేదో తెలియ‌దు కాని, ఇప్ప‌టికే గుండ్లు గీయించుకుంటాం అని సినిమా లెవ‌ల్ డైలాగులు చెబుతున్నారు..గ‌తంలో గుండ్లు గీయించుకుంటామ‌ని నేత‌లు చెప్పేవారు.. ఇంకా ఆ గుండ్లు గీయించుకుంటాం అనే మాట ఫ్యాష‌న్ గా చెబుతున్నారు.
 
అయితే బీజేపీ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ బీజేపీ ఏపీ అధ్య‌క్ష ప‌ద‌విలోకి చేరిన త‌ర్వాత ఇప్పుడు బీజేపీ అసంతృఫ్తులు అలాగే క‌న్నాతో స‌రిస‌మానంగా కాంగ్రెస్ లో ఎదిగి ఇప్పుడు టీడీపీలో ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం అసంతృప్తులు రగిలిపోతున్నారు.. క‌న్నాకు ప‌ద‌వి వ‌చ్చిన త‌ర్వాత వీరి ప‌ద‌వులు ఎలా ఉన్నా వ‌ణుకు బెణుకు మాత్రం పెరిగిపోయింది. అయితే తాజాగా బుద్దా వెంక‌న్న తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీగా బాగా పేరు తెచ్చుకున్న వ్య‌క్తి స‌మ‌యం దొరికితే జ‌గ‌న్ ని విమ‌ర్శించ‌డంలో ఆయ‌న రికార్డును ఎవ‌రూ దాట‌లేరు.. వైయ‌స్ జ‌గ‌న్ పై అంత లెవ‌ల్లో విరుచుకుప‌డ‌తారు.
 
ఆయ‌న బీజేపీ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ విష‌యంలో ఓ సవాల్ విసిరారు.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు డిపాజిట్ వ‌స్తే నేను గుండు గీయించుకుంటా అని అన్నారు.. ఇక రాష్ట్రంలో ఆయ‌న ఎక్కడి నుంచి అయినా పోటికి సిద్దం అని స‌వాల్ విసిరారు....ప్రధాని నరేంద్రమోదీపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆందోళన బాట పట్టింది.
 
దీంతో మీడియా ముందుకు వ‌చ్చి ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న ఫైర్ అయ్యారు.. అయితే ఆయ‌న నాలుగు ద‌శాబ్దాలు రాజ‌కీయంగా ఉన్న నేత, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌ల్లో నిల‌బ‌డిన వ్య‌క్తి.. సీఎంగా కూడా ఆయ‌న‌కు కాంగ్రెస్ ఛాన్స్ ఇస్తాన‌ని చెప్పింది.. ఆయ‌నకు డిపాజిట్ కూడా రాదు అని అన‌డంపై ఇప్పుడు రాజ‌కీయంగా కాక‌పుట్టిస్తోంది ఈ వ్యాఖ్య‌.
 
మరి ఈ గుండుస‌వాల్ రికార్డు ఎలా ఉంటుందో చూడాలి.. ఇటీవ‌ల చాలా మంది  తాము ఎన్నిక‌ల్లో ఓడిపోతే గుండు గీయించుకు తిరుగుతామ‌ని చెప్పిన విష‌యం తెలిసిందే.

షేర్ :

Comments

1 Comment

  1. Ee lucha buddha gaadu Gundu yenti veedi pellam nj ayina bet kaastadu. Veedi akka, veedi pellam akhariki veexi talli yelanti do andariki telusu.

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.