బుట్టాను అవ‌మానించిన టీడీపీ నాయ‌కులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

butta renuka
Updated:  2018-09-26 04:07:32

బుట్టాను అవ‌మానించిన టీడీపీ నాయ‌కులు

తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఏపీలో మొదటిసారిగా 2014లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచి ఆ త‌ర్వాత అధికార ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి క‌ర్నూల్ జిల్లాకు చెందిన  ఇద్ద‌రు పార్ల‌మెంట్ స‌భ్యులు బుట్టారేణుక‌, ఎస్పీవైరెడ్డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్న‌సంగతి తెలిసిందే. టీడీపీ తీర్థం తీసుకున్నా కూడా వీరికి ఎలాంటి గుర్తింపు లేదు. దీంతో ఒకానోక సంద‌ర్భంలో అన‌వ‌స‌రంగా పార్టీలోకి ఫిరాయించామ‌నే అలోచ‌న కూడా చేసిన‌ట్లు తెలుస్తుంది.
 
ఈ క్ర‌మంలో  ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఫిరాయింపు ఎంపీ బుట్టారేణుక‌ ప‌రిస్థితి అద్వానంగా మారింది. జిల్లాలో ఏ కార్య‌క్ర‌మం జరిగినా కూడా పార్టీ నేత‌లు ఆమెను ఆహ్వానించ‌కుండా అవ‌మానిస్తునే ఉన్నారు. అయితే ఇదే క్ర‌మంలో తాజాగా మ‌రోసారి టీడీపీ నాయ‌కులు బుట్టాను అవ‌మానించారు. 
 
జిల్లాలో టీడీపీ నాయ‌కులు ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో ఆమెను టీడీపీ నాయ‌కులు ఆహ్వానించ‌లేదు. దీంతో బుట్టా తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. తాను అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులతో జ‌త‌క‌ట్టినా కూడా పార్టీ నాయ‌కులు త‌న‌ను అవ‌మానించార‌ని బుట్టా మండిప‌డ్డారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.