అందుకే మూకి డ్రామా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-08 06:36:12

అందుకే మూకి డ్రామా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు జ‌రిగిన అన్యాయంపై పార్ల‌మెంట్ లో ఎవ‌రు ఆడాల్సిన ఆట వారు ఆడుతున్నారు.  లోలోప‌ల ఎన్ని రాజ‌కీయ ప‌రిచయాలు, రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు ఉన్నా.... వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, తెలుగు దేశం పార్టీ  ఎంపీలు పార్ల‌మెంట్ లో వారి నిర‌స‌న‌లు మాత్రం తెలియ‌జేస్తున్నారు.
 
అయితే వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి  పార్టీ ఫిరాయించిన క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక‌, అర‌కు ఎంపీ  కొత్త‌ప‌ల్లి గీత మాత్రం పార్ల‌మెంట్  లో  మూకి డ్రామాకు ప‌రిమిత‌మ‌య్యారు. ఏపీకి జ‌రిగిన అన్యాయంపై అధికార, ప్ర‌తిప‌క్షాల ఎంపీలు నిల‌దీస్తున్న‌పుడు వారికి  ఓట్లు వేసి గెలిపించిన  ప్ర‌జ‌ల కోసం ఏదో ఒక పార్టీ త‌ర‌పున కేంద్రాన్ని నిల‌దీయాల్సిన బాధ్య‌త వీరిపై ఉంది. 
 
అయితే  గ‌తంలో ప‌లు స‌మ‌స్య‌ల‌పై పార్ల‌మెంట్ లో గ‌ళ‌మెత్తిన వీరిద్ద‌రూ ఇప్పుడు బ‌డ్జెట్ విష‌యంలో మాత్రం అస్స‌లు మాట్లాడ‌టం లేదు. ఇందుకు కార‌ణం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అని సాక్షి క‌థ‌నంలో పేర్కొంది. ఫిరాయించిన  ఎంపీల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కోరుతూ  ఇప్ప‌టికే రాష్ట్ర‌ప‌తికి, లోక్ స‌భ స్పీక‌ర్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది.
 
ఈ క్ర‌మంలో ఫిరాయించిన ఎంపీలు, టీడీపీ ఎంపీల‌తో క‌లిసి నిర‌స‌న తెలియ‌జేస్తూ క‌నిపిస్తే అన‌ర్హ‌త వేటు వేసే అవ‌కాశం ఉంద‌నే భ‌యంతోనే గీత‌, బుట్టా రేణుక ఏమీ మాట్లాడ‌లేక‌పోతున్నార‌ని సాక్షి పేర్కొంది. నిజ‌మే!! అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు స‌మ‌క్షంలో నిర్వ‌హించిన టీడీపీ ఎంపీల స‌మావేశానికి హాజ‌రైన బుట్టా రేణుక లోక్ స‌భ‌లో మాత్రం సైలెంట్ గా ఉందండోయ్...!!

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.