వైసీపీలోకి బై రెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-12 16:07:31

వైసీపీలోకి బై రెడ్డి

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు రాయ‌ల‌సీమ‌లో అధికార తెలుగుదేశం పార్టీకి బీట‌లు వాల‌నున్నాయా అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ముఖ్యంగా క‌ర్నూల్, అనంత‌పురం జిల్లాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి చావుదెబ్బ‌కొట్ట‌నుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.అయితే ఈ క్ర‌మంలో టీడీపీ నాయ‌కులు త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైపీపీ తీర్థం తీసుకుంటున్నారు.
 
ఇక ఇదే క్ర‌మంలో బ‌న‌గాన‌పల్లెకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే బీసీ జ‌నార్థ‌న రెడ్డి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఖ‌చ్చితంగా ఓడిపోతాన‌నే భ‌యంతో ఆయ‌న కూడా వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యారనే వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ ఇంత వ‌ర‌కూ ఈ విష‌యంపై స్పందించ‌లేదు. దీంతో మ‌రికొన్ని రోజుల్లో బీసీ జ‌నార్ధ‌న రెడ్డి వైసీపీలో చేర‌డం ఖాయం అని తెలుస్తోంది.
 
క‌ర్నూల్ జిల్లాలో టీడీపీ కేడ‌ర్ అంతంత మాత్రాన ఉన్న నేప‌థ్యంలో పార్టీలో ఉన్న నాయ‌కులు కూడా వైసీపీలోకి చేరేందుకు స‌న్న‌హాలు చేస్తున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి ఈ జిల్లా నుంచి డిపాజిట్లు కూడా రావ‌ని తెలుస్తోంది. ఇక తాజాగా ఇదే క్ర‌మంలో రాయ‌ల‌సీమ‌ రాష్ట్ర సాధ‌న కోసం కీల‌క పాత్ర పోషించిన బైరెడ్డి ఫ్యామిలీ కూడా వైసీపీలోకి చేరేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే బైరెడ్డి ఫ్యామిలీ రెండు వ‌ర్గాలుగా విడిపోవ‌డంతో అందులో ఒక వ‌ర్గం వైసీపీ కండువా క‌ప్పుకోనుందనే వార్త‌లు వ‌స్తున్నాయి.
 
ఇంత‌కు ఏ వ‌ర్గం వైసీపీలో చేరుతుందంటే బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌మ్ముడి కొడుకు బైరెడ్డి సిద్దార్థ‌రెడ్డి వ‌ర్గం నేత‌లు త్వ‌ర‌లో వైసీపీలో చేర‌నున్నారట‌. క‌ర్నూల్ జిల్లాలో బైరెడ్డి ఫ్యామిలీ అంటే ఎవ‌రిని అడిగినా చెబుతారు అంత‌టి గుర్తింపు ఉన్న ఈ ఫ్యామిలీ త్వ‌ర‌లో వైసీపీలో చేర‌నున్నారు. గ‌తంలో వీరు ఏ పార్టీలో లేక‌పోయినా కూడా సొంత‌నియోజ‌కవ‌ర్గం అయిన నందికొట్కురు,  పాణ్యంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా బైరెడ్డి ఫ్యామిలీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. దీంతోపాటు ప్ర‌జాధ‌ర‌ణ కుడా ఉంది.
 
అయితే ఈ మ‌ధ్య కాలంలో బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డికి, బైరెడ్డి సిద్దార్థ రెడ్డిల మ‌ధ్య విభేదాలు త‌లెత్త‌డంతో వీరు రెండు వ‌ర్గాలుగా మారిపోయారు. కానీ కేడ‌ర్ మాత్రం అలాగే ఉంది. సిద్దార్థ రెడ్డి యువ నాయ‌కుడుగా జిల్లా వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  
 
19 సంవ‌త్సరాల‌కే రాజ‌కీయంలోకి వ‌చ్చారు. ఆ త‌ర్వాత నుంచి రాయ‌ల‌సీమ‌లో జ‌రుగుతున్న అన్యాయాల‌ను ప్ర‌భుత్వాని తెలిసేలా ఉద్య‌మాలు కుడా చేసి రాయ‌ల‌సీమ‌లో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంత‌టి గుర్తింపు ఉన్న సిద్దార్థ‌రెడ్డి వైసీపీలో చేరితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి మ‌రింత ఎన‌ర్జీని ఇచ్చిన‌ట్లు అవుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.