ఆయ‌న రాజీనామాతో క‌డ‌ప జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

congress party
Updated:  2018-11-03 03:28:12

ఆయ‌న రాజీనామాతో క‌డ‌ప జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ

వైఎస్ హ‌యాంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే క‌డ‌ప జిల్లా అని చెప్పుకునే విధంగా ఉండేది గ‌తంలో. కానీ వైఎస్ అకాల మ‌ర‌ణం త‌ర్వాత  వైఎస్  కుటుంబం కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కొత్త పార్టీ స్థాపించ‌డంతో జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయ‌కులు అంతా గ‌తంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక కొంత‌మంది సీనియ‌ర్ నాయ‌కులు మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడ‌లేక అలాగే ఉండిపోయారు. ఇక ఇప్పుడు 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో టీడీపీ గ్రాఫ్ త‌గ్గిపోతుండ‌టంతో చంద్ర‌బాబు నాయుడు హ‌స్తిన సాక్షిగా  రాహుల్ గాంధీతో దోస్తి కుదుర్చుకున్నారు. దీంతో జిల్లా సినియ‌ర్ నాయ‌కుడు సి.రామ‌చంద్ర‌య్య జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 
 
గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌ను తిట్టి పోసిన రోజులు లేక‌పోలేద‌ని రామ‌చంద్ర‌య్య‌ గుర్తు చేశారు. అలాంటి చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు దేశ భ‌విష్య‌త్,  రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవ‌డం అంత‌కంటే దౌర్భాగ్యం మ‌రొక‌టి లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఇలాంటి ప‌రిస్ధితిలో తాను కాంగ్రెస్ పార్టీలో ఇమ‌డ‌లేని అందుకే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాన‌ని స్ప‌ష్టం చేశారు రామ‌చంద్ర‌య్య‌. దీంతో తుల‌సి రెడ్డిని మిన‌హా ఇస్తే క‌డ‌ప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దరిదాపు ఖాళీ అయింద‌నే చెప్పాలి. 
 
విభ‌జ‌న చ‌ట్టం కింద రాష్ట్రానికి 2 ల‌క్ష‌ల కోట్లు రావ‌ల్సి ఉన్నా వాటిని సాధించ‌డంలో చంద్ర