బాలయ్య, యనమల ముఖ్యమంత్రి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-21 12:12:52

బాలయ్య, యనమల ముఖ్యమంత్రి

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి  సి. రామ‌చంద్ర‌య్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు  కేంద్ర ప్ర‌భుత్వం నుండి  రావాల్సిన వాటిని సాధించ‌కోవ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మయ్యార‌ని ఆయ‌న అన్నారు. 

తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు పూర్త‌వుతున్నా ఎక్కడ వేసిన గొంగ‌ళి అక్క‌డే ఉంద‌ని ఎద్దేవా చేశారు.  ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబు అడ్డంగా ఇరుక్కోవ‌డం ఏపీకి శాపంగా మారింద‌ని రామ‌చంద్ర‌య్య అభిప్రాయ‌ప‌డ్డారు. 

కేంద్ర ప్ర‌భుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మంత్రులు బ‌య‌ట‌కు వ‌స్తేనే ప్ర‌జ‌లు నమ్మే అవ‌కాశం ఉంద‌ని, ముంఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు విఫ‌లం అయ్యారు కావున య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు  లేదా బాల‌కృష్ణ వంటివారిని సీఎంగా చేస్తే మంచిద‌ని స‌ల‌హా ఇచ్చారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.