బాబు కేసుల పై సి.రామ‌చంద్ర‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-02 03:57:43

బాబు కేసుల పై సి.రామ‌చంద్ర‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీకి కేంద్రం మొండిచెయ్యి చూపి 24 గంట‌లు గ‌డిచే స‌మ‌యానికి  బీజేపీ పై తెలుగుదేశం విమ‌ర్శలు ఎక్కుపెట్టింది.. ఇక ఏపీలో తెలుగుదేశం బీజేపీకి  క‌టీఫ్ చెప్ప‌డానికి రెడీ అవుతోంది అని,  నాయ‌కుల మాట‌లు ప‌రుష వ్యాఖ్య‌లు చూస్తుంటేనే అర్ధం అవుతోంది... ఇక కాంగ్రెస్ నాయ‌కులు వైసీపీ నాయ‌కులు కూడా బాబును సెంట‌ర్ చేసి ఫైర్ అవుతున్నారు.
 
తాజాగా  కేంద్ర  బ‌డ్జెట్ లో  ఈ సారి కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి మొండిచెయ్యి చూపార‌ని కాంగ్రెస్  నాయ‌కుడు సి రామచంద్ర‌య్య విమ‌ర్శించారు. మ‌న‌కు విభ‌జ‌న‌గా ఉన్న హక్కుల  పూర్వకంగా వచ్చేవి కూడా ఇవ్వలేదని, ఏపీని కేంద్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాజ‌ధానిపై ప్ర‌క‌ట‌న లేదు సాయం లేదు, రైల్వే జోన్ ఊసేలేదు, క‌డ‌ప ఉక్కుపై స్ప‌ష్ట‌త లేదు  అని అన్నారు సి రామ‌చంద్ర‌య్య‌.
 
రాష్ట్రం త‌ర‌పున ఇంత మంది ఎంపీలు ఉన్నా ఎటువంటి  స‌పోర్ట్ కేంద్రం ఏపీకి ఇవ్వ‌డం లేద‌ని, దీనిపై అడిగే నాయ‌కులు లేర‌ని ఆయ‌న విమ‌ర్శించారు... కేంద్రంలో మంత్రులుగా కొన‌సాగుతున్నా స‌రే ఎందుకు బాబు వారిని ప్ర‌శ్నించ‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శలు చేశారు, తెలుగుదేశం అధినేత పై.
 
ఆ నాడు  తెలుగుప్రజల ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ నిలబెడితే ఇప్పటి టీడీపీ ప్రభుత్వం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. చంద్రబాబు చేతకాని తనం ఆయనపై ఉన్న కేసులు రాష్ట్ర ప్రజలకు శాపంగా మారాయని అన్నారు. ఇంకెంతకాలం చంద్రబాబు నాటకాలు ఆడతారని సూటిగా ప్రశ్నించారు. ఇక సంవ‌త్స‌రానికి ఓసారి ప్ర‌ధాని అపాయింట్ మెంట్  వ‌స్తోంద‌ని, దానికి సంబ‌రాలు చేసుకుంటున్నారు తెలుగుదేశం నాయ‌కులు అని ఆయ‌న ఎద్దెవా చేశారు.. ప్రజలను మోసం చేసే వ్యక్తులు, విదేశీ బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు ఎగ్గొట్టిన నాయకులు, కేంద్ర మంత్రులుగా ఉండటం బాధాకరమన్నారు. ఇటువంటి వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహించడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.