బోండా ఉమా భార్య‌పై కేసు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-28 11:28:51

బోండా ఉమా భార్య‌పై కేసు

అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన కొంద‌రు ఎమ్మెల్యేలు, ఎంపీలపై ప‌లు కేసులు న‌మోదు అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు ఆరోప‌ణ‌ల‌తో ఎమ్మెల్సీలు వాకాటి నారాయ‌ణ రెడ్డి, దీప‌క్ రెడ్డి వంటి వారు పార్టీ నుండి స‌స్పెండ్ అయిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.

ఇప్పుడు ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర రావు భూ వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా రూ. 40 కోట్లు విలువ చేసే భూమిని కొట్టేసేందుకు ప్లాన్ వేశారు. స్వాతంత్య్ర‌స‌మ‌ర యోధుల‌కు సంబంధించిన భూముల‌పై బోండా ఉమా అనుచ‌రులు క‌న్నేశారు.

భూమిని క‌బ్జా చేసేందుకు న‌కిలీ ప‌త్రాల‌ను కూడా సృష్టించారు. అప్పు ఇస్తామంటూ రామి రెడ్డి కోటేశ్వ‌రావవు అనే వ్య‌క్తికి గాలం వేశారు. త‌న‌ఖా పేరుతో రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యానికి తీసుకెళ్లి సంత‌కాలు పెట్టించుకున్నారు. ఈ సంత‌కాల‌తో కోటేశ్వ‌రావుతో భూమి కొనుగోలు చేసిన‌ట్లు న‌కిలీ ప‌త్రాలు సృష్టించారు.

సీఐడీ విచార‌ణ‌లో ఈ విష‌యాలు వెల్ల‌డి అయ్యాయి. త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలంటు బాధితుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి ఎమ్మెల్యే బోండా ఉమా భార్య‌పై భూ క‌బ్జా కేసు న‌మోదైంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.