బ్రేకింగ్.. పెద్దారెడ్డికి 14రోజుల‌ రిమాండ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp and pedda reddy
Updated:  2018-09-01 12:45:58

బ్రేకింగ్.. పెద్దారెడ్డికి 14రోజుల‌ రిమాండ్

తాడిప‌త్రిలో జేసీ బ్ర‌ద‌ర్స్ ఆగ‌డాల‌కు ప్ర‌జ‌లు అల్లాడుతున్నారని ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ‌ర్మ‌వ‌రం స‌మ‌న్వ‌య క‌ర్త కేతిరెడ్డి వెంక‌ట‌రామి రెడ్డి మండిప‌డ్డారు. గురువారం జేసీ అనుచ‌రులు వైసీపీ కార్య‌క‌ర్త‌పై దాడి చేసిన నేప‌థ్యంలో తాడిప‌త్రి వైసీపీ స‌మ‌న్వ‌య క‌ర్త పెద్దారెడ్డి త‌మ కార్య‌క‌ర్త‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లారు.
 
దీంతో పోలీస్ అధికారులు రాత్రికి రాత్రే య‌ల్ల‌నూరులో పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి ఆయ‌న‌ను పోలీసులు పామిడి పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. శుక్ర‌వారం ఉద‌యం ఆయ‌న‌కు గుత్తి ఆసుప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు చేసి ఆ త‌ర్వాత జేఎఫ్ సీఎం మంజులా ముందు హాజ‌రు ప‌రిచారు. ఆయ‌న‌పై న‌మోదు అయిన ప‌లు సెక్ష‌న్ల కింద మంజులత‌ 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆయ‌న‌ను తాడిప‌త్రి స‌బ్ జైలుకు త‌ర‌లించాల‌ని ఆదేశించింది. 
 
అయితే పెద్దారెడ్డిని తాడిపత్రి స‌బ్ జైలుకు త‌ర‌లిస్తే అక్క‌డ లా అండ్ ఆర్డ‌ర్ దెబ్బ‌తింటుంద‌ని పోలీసులు మంజులత‌కు విన్న వించ‌డంతో ఆయ‌న‌ను గుత్తి స‌బ్ జైలుకు త‌ర‌లించారు.పెద్దారెడ్డిపై న‌మోదైన కేసులు 147,148,448,354,307,506, రెడ్ విత్ 149 సెక్ష‌న్ల కింద్ పోలీసులు కేసులు న‌మోదు చేశారు.

షేర్ :<