బ్రేకింగ్.. చింత‌మ‌నేనిపై కేసున‌మోదు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp mla chinthamaneni
Updated:  2018-09-21 10:41:31

బ్రేకింగ్.. చింత‌మ‌నేనిపై కేసున‌మోదు

అధికార తెలుగుదేశం పార్టీ దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ పై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేష‌న్ లో తాజాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసును న‌మోదు చేశారు. ఈ నెల ప‌దిన ఐఎంఎల్ డిపోలో హ‌మాలీ మేస్త్రీగా ప‌ని చేస్తున్న రాచీటి జాన్ పై ఎమ్మెల్యే చింత‌మ‌నేని అత‌ని అనుచ‌రులు గ‌న్ మ్యాన్లు చిత‌క బాదారు. దీంతో బాధితుడు జాన్ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు.
 
అయితే ఆ వ్య‌క్తి  ఫిర్యాదు చేసినా కూడా చింత‌మ‌నేనిపై పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. అత‌ని ఫిర్యాదును అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో వామ‌ప‌క్షాలు ప్ర‌జా ప్ర‌తినిధులు చింత‌మ‌నేనికి వ్య‌తిరేకంగా పెద్దఎత్తున ఆందోళ‌న‌లు చేప‌ట్టాయి. చింత‌మ‌నేని అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారుల‌పై ఆయ‌న దాడి చేయ‌డంపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.  ఈ క్ర‌మంలో వారు చింత‌మ‌నేనిని అరెస్ట్ చేసేంత వ‌ర‌కు నిర‌స‌న‌లు తెలుప‌డంతో చేసేది ఏమిలేక ఆయ‌న‌పై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధ‌క చ‌ట్టం, ఐపీసీ 323 సెక్ష‌న్ కింద పోలీసులు కేసున‌మోదు చేశారు.
 
ఐఎంఎల్ డిపోలో ఓ హామాలీ స‌క్ర‌మంగా ప‌నిచేయ‌క‌పోవ‌డంతో ఆ హ‌మాలీని జాన్ ప‌నిలోనుంచి తొల‌గించారు. ఇక ఈ విష‌యం తెలుసుకున్న చింత‌మ‌నేని అత‌డిని తిరిగి ప‌నిలో చేర్చుకోవాల‌ని సూచించారు. అయితే ఇందుకు జాన్ నిరాక‌రించ‌గా అత‌నిపై దాడి చేశారు. అంతేకాదు కులం పేరుతో దూషించారు. ఇక ఈ విష‌యంపై కార్మిక సంఘాల ఆధ్వ‌ర్యంలో పెద్దఎత్తున నిర‌స‌న‌లు తెలిపారు. దీంతో చింత‌మ‌నేనిపై పోలీస్ అధికారులు కేసు న‌మోదు చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.