టీడీటీ ఎంపీ పై కేసు న‌మోదు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-13 16:05:02

టీడీటీ ఎంపీ పై కేసు న‌మోదు

అధికార తెలుగుదేశం పార్టీ చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్ పార్ల‌మెంట్ స‌మావేశాల సంద‌ర్భంగా ప్ర‌తీ రోజు ఆయ‌న కేంద్ర ప్రభుత్వానికి వ్య‌తిరేకంగా త‌న వేష‌ధార‌ణ‌తో నిర‌స‌ణ‌లను వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే క్ర‌మంలో  మొన్న హిజ్రాల గెట‌ప్ లో వేషం వేసుకుని త‌న నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇక ఆయ‌న వేసిన వేషంపై రాష్ట్ర వ్య‌ర్తంగా ఉన్న హిజ్రాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
 
టీడీపీ ఎంపీ శివ‌ప్ర‌సాద్ త‌మ‌ను అవ‌మానించారు అంటూ హిజ్రాలు ఆవేద‌న‌ వ్య‌క్తం చేస్తున్నారు. వెంట‌నే ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌ర్నూలు జిల్లా నంద్యాల పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు హిజ్రాలు. స‌మాజంలో చిన్న చూపు ఎదుర్కొంటున్నా త‌మ‌ను ప్ర‌జా ప్ర‌తినిధులు ఆదుకోవాల్సిందిపోయి మ‌రింత క్రుంగిపోయేలా వ్య‌వ‌హ‌రించ‌డం బాధాకరం అంటున్నారు హిజ్రాలు.
 
త‌మ‌ను అవ‌మానిస్తూ పార్ల‌మెంట్ ముందు నిర‌స‌న‌లు తెలిపిన ఎంపీ శివ‌ప్ర‌సాద్ త‌క్ష‌ణ‌మే క్ష‌మాప‌ణ‌ తెలపాల‌ని వారు డిమాండ్ చేశారు. త‌మ‌ను ఆదుకుంటామ‌ని చెప్పే నాయ‌కులు ఇలా అవ‌మానిస్తే తాము ఎవ‌రికి చెప్పుకోవాల‌ని వారు వాపోయారు. ఆయ‌న వెంట‌నే దేశ‌ వ్యాప్తంగా ఉన్న హిజ్రాల‌కు క్ష‌మాప‌ణ‌ చెప్పాల‌ని లేక‌పోతే త‌మ నిర‌స‌న‌ను మ‌రింత ఉద్రిక్తం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఈ మేర‌కు నంద్యాల పీఎస్ లో ఎంపీ శివ‌ప్ర‌సాద్ పై కేసున‌మోదు అయినట్లు తెలుస్తోంది.
 

షేర్ :

Comments

0 Comment