రోజా పై కేసు నమోదు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysrcp mla roja
Updated:  2018-07-30 04:42:00

రోజా పై కేసు నమోదు

విభ‌జ‌న‌ చ‌ట్టంలో పొందుప‌రిచిన‌న ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఖ‌రికి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నెల 27వ తేదిన రాష్ట్ర పంద్ కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. శాంతి యుతంగా వైసీపీ నాయ‌కులు బంద్ ను పాటిస్తే ప్ర‌త్యేక హోదా క్రెడిట్ మొత్తం జ‌గ‌న్ కు పోతుంద‌ని భావించి అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు అక్ర‌మంగా అరెస్ట్ చేయించారు. 
 
అంతేకాదు వైసీపీ బంద్ లో స్వ‌చ్చందంగా పాల్గొన్న మ‌హిళ‌ల‌ను కూడా పోలీస్ అధికారులు పాశ‌వికంగా ప్ర‌వ‌ర్తించి వారిని అరెస్ట్ చేశారు. ఇక ఇదే క్ర‌మంలో వైసీపీ న‌గ‌రి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా కూడా వైసీపీ నాయ‌కులతో హైవేపై  బంద్ నిర్వ‌హిస్తుంటే ఆ బంద్ లో పాల్గొన్న ఆమెను పోలీసులు అక్ర‌మంగా అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక ఈ కేసుపై విచార‌ణ‌ చేసిన పోలీసులు రోజా పై సెక్ష‌న్ 143, సెక్ష‌న్,146, 341, 353, 506 సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇక ఈ కేసుల‌పై రోజా స్పందిస్తూ, త‌న‌ను అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ధైర్యంగా ఎదుర్కోలేక ఇలా దొడ్డి దారిన పోలీస్ అధికారుల‌తో కేసులు పెట్టిస్తున్నార‌ని ఆమె మండిప‌డ్డారు. అయితే త‌న‌పై టీడీపీ నాయ‌కులు ఎన్ని కేసులు పెట్టించినా బ‌య‌ప‌డేది లేద‌ని రోజా స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.