ప‌రిటాల శ్రీరాంపై కేసు న‌మోదు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

paritala sri ram
Updated:  2018-09-06 12:07:18

ప‌రిటాల శ్రీరాంపై కేసు న‌మోదు

2014లో అధికారంలోకి వ‌చ్చిన తెలుగుదేశం పార్టీ నాయ‌కుల ఆగ‌డాల‌కు అడ్డు అదుపు లేకుండా పోతుంది. టీడీపీకి మ‌ద్ద‌తు తెలుప‌కున్నా, వారి కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు కాకుంటే చాలు వారిపై దాడికి దిగుతున్నారు. అయితే ఇదే క్ర‌మంలో కొద్దిరోజుల క్రితం మంత్రి ప‌రిటాల సునిత కుమారుడు ప‌రిటాల శ్రీరాం  ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌పై దాడి చేశారు. 
 
వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి , చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి త‌దిత‌రులు ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 7న రామ‌గిరి మండాలాని వ‌చ్చారు. ఇక త‌మ‌ నాయ‌కులు వ‌చ్చార‌నే ఉద్దేశంతో వైసీపీ కార్య‌క‌ర్త లెక్క‌న్న‌గారి నారాయ‌ణ వారితో క‌లిసి పేరూరులో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు . చాలా కాలంగా నారాయ‌ణ వైసీపీలో చురుకుగా క‌నిపిస్తుండ‌టంతో ప‌రిటాల శ్రీరాం త‌న అనుచ‌రుతో క‌లిసి స‌భ అయిపోయిన త‌ర్వాత నారాయ‌ణ‌ను బ‌ల‌వంతంగా మారాణాయుదాల‌తో బెదిరించి జీప్ లో ఎక్కించుకుని ప‌రిటాల నివాసానికి తీసుకువ‌చ్చారు. 
 
ప‌రిటాల నివాసంలో నారాయ‌ణను భుజం, కాళ్లు విరిగేలా కొట్టి ఆ త‌ర్వాత రామ‌గిరి పోలీస్ స్టేష‌న్ లోతెల్ల‌ని కాగితం మీద సంత‌కం చేయించుకున్నారు. ఆ త‌ర్వాత ధ‌ర్మ‌వ‌రం పోలీస్ స్టేష‌న్ కు అలాగే క‌ర్ణాట‌క‌లోని తూముకూర్ తీసుకువెళ్లి అప్పుడు ఆయ‌న‌ను త‌న నివాసంలో వ‌దిలివెళ్లారు. నారాయ‌ణ‌తో సంత‌కం ఎందుకు పెట్టించారు అంటే త‌న‌పై దాడి చేసింది వైసీపీ నాయ‌కులు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మ‌రికొంద‌రు కిడ్నాప్ చేసినార‌నే కేసు న‌మోదు చేశారు. ఇక ఈ విష‌యం తెలుసుకున్న నారాయ‌ణ త‌న‌ను కొట్టింది వైసీపీ నాయ‌కులు కాదు టీడీపీ నాయ‌కులు అని చెప్పినా కూడా పోలీసులు విన‌కుండా ప‌రిటాల శ్రీరాం కు వ‌త్తాసుప‌లికి వైసీపీ నాయ‌కుల‌పై ఎఫైయ్యార్ ఫిల్ చేశారు. 
 
దీంతో నారాయ‌ణ హైకోర్టులో పిటీష‌న్ వేశారు. నారాయ‌ణ వేసిన పిటీష‌న్ పై జ‌స్టిస్ ఎ. రాజ‌శేఖ‌ర్ రెడ్డి విచార‌ణ జ‌రిపారు . పిటీష‌న‌ర్ త‌ర‌పున వాద‌న‌లువిన్న ద‌ర్మాస‌నం నారాయ‌ణ‌పై దాడీ చేసిన ప‌రిటాల శ్రీరాం అలాగే అత‌ని కార్య‌క‌ర్త‌లును అరెస్ట్ చేసి కేసు న‌మోదు చెయ్య‌ల‌ని సూచించింది. అంతేకాదు నిష్ఫ‌క్షికంగా ఈ కేసు విచార‌ణ‌ను ద‌ర్యాప్తు చెయ్య‌ల‌ని అనంత‌పురం పోలీసుల‌కు ద‌ర్మాస‌నం ఆదేశించింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.