బ్రేకింగ్.. వైసీపీ ఎమ్మెల్యేపై కేసు న‌మోదు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysrcp
Updated:  2018-10-29 05:28:24

బ్రేకింగ్.. వైసీపీ ఎమ్మెల్యేపై కేసు న‌మోదు

ఏపీ ప్రతిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌పై ఏపీ స‌ర్కార్ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై గ‌త బుధ‌వారం మ‌ధ్యాహ్నం 12 స‌మ‌యంలో విశాఖ ఎయిర్ పోర్టులో హ‌త్యాయ‌త్నం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే .
 
ఇక ఈ హత్యాయ‌త్నాన్ని నిర‌సిస్తూ తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ధ‌ర్నాలు, నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు విసృతంగా చేప‌ట్టారు. ఇక దీన్ని త‌ప్పుబ‌డుతూ ఏపీ ప్ర‌భుత్వం ఇప్పుడు వారిపై అక్ర‌మ కేసుల‌ను న‌మోదు చేస్తోంది. తాజాగా మంగ‌ళ‌గిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల‌రామ‌కృష్ణా రెడ్డి చేసిన ధ‌ర్నాపై పోలీస్ అధికారులు ఆయ‌న‌కు నోటీసుల‌ను జారీ చేశారు.
 
ఈ నోటీసుల‌ను తీసుకునేందుకు ఆయ‌న‌ను మంగ‌ళ‌గిరి పోలీస్టేష‌న్ కు పిలిపించారు. ఐపీసీ సెక్ష‌న్ 341, 1881, సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. ఈ కేసుల‌పై స్పందించిన వైసీపీ నాయ‌కులు అక్ర‌మంగా స‌ర్కార్ నాయ‌కులు ఎన్నికేసులు పెట్టించిన భ‌య‌ప‌డేది లేద‌ని అంటున్నారు. శాంతియుతంగా నిర‌స‌న‌లు చేస్తున్న త‌మ‌పై అక్ర‌మ కేసులు పెడుతున్నార‌ని ఆళ్ల‌రామ‌కృష్ణా రెడ్డి మండిప‌డ్డారు.

షేర్ :