సీబీఐ జేడి ల‌క్ష్మి నారాయ‌ణ రాజీనామా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

cbi lakshmi narayana
Updated:  2018-03-22 17:55:56

సీబీఐ జేడి ల‌క్ష్మి నారాయ‌ణ రాజీనామా

ఉన్న‌త ఉద్యోగులు అంద‌రూ రాజ‌కీయాల బాట‌ప‌ట్టిన సంగ‌తులు సంద‌ర్బాలు మ‌న‌కు తెలిసిన‌వే... ఇటు రాజ‌కీయ పార్టీల్లో చ‌క్రం తిప్పుతున్న మాజీ ఉన్నత ఉద్యోగుల గురించి మ‌న‌కు విధిత‌మే, అయితే ఇప్పుడు తాజాగా ఓ కొత్త వార్త పొలిటిక‌ల్ స‌ర్కిల్స్  బ్యూరోక్రాట్స్ కు మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌ను తీసుకువచ్చింది.
 
అవును మ‌హ‌రాష్ట్ర అడిష‌న‌ల్ డిజి ప‌ద‌వికి జేడి ల‌క్ష్మి నారాయ‌ణ  రాజీనామా చేశారు... ఆయ‌న ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  సిబిఐ జేడిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన విష‌యం అంద‌రికి తెలిసిందే... అయితే తాజాగా విఆర్‌య‌స్‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని మ‌హ‌రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారనే వార్త వినిపిస్తోంది... ఇప్పుడు ఈ వార్త పెను వైర‌ల్ గా మారింది. అయితే ఆయ‌న రాజీనామా చేసిన వార్త క‌న్నాఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తారు అనే వార్త ఇప్పుడు వైర‌ల్ అవుతోంది..
 
ముంబై అడిషనల్ డీజీపీగా పనిచేస్తున్న ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయ‌న ఎటువంటి క్లారీటీ ఇవ్వ‌లేదు.. ఇక ఆయ‌న‌కు అత్యున్నత కేడ‌ర్ పోస్టు అయిన డీజీపీ ప‌ద‌వి రానుంది మ‌రో ఆరు నెల‌ల్లో, ఈయ‌న ఇటువంటి స‌మ‌యంలో ఎందుకు ఇటువంటి నిర్ణ‌యం తీసుకుంటారు అనే వాద‌న వినిపిస్తోంది.
 
గ‌తంలో  జ‌గ‌న్ - గాలిజ‌నార్ధ‌న్ రెడ్డి కేసుల విష‌యంలో ఆయ‌న ఫేమ‌స్ అయ్యారు, అయితే జ‌గ‌న్ కేసులు చార్జ్ షీట్లు కొట్టివేస్తుంటే అదే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌.. ఇక్క‌డ ఆ నిజాలు అన్ని ఇప్పుడు అవాస్త‌వాలు అయ్యాయి అని కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు.. మ‌రి ఆయ‌న ఏ పార్టీలో చేరుతారు అనేది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్నార్ద‌కంగా మారింది... అయితే ముందు ఆయ‌న రాజీనామా విష‌యాన్ని ఆయ‌న తెలియ‌చేస్తే, దానిపై క్లారిటీ వ‌స్తే అప్పుడు పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి ఆలోచిద్దాం అంటున్నారు నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.