ఏపీలో మరో సంచలనం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

sensation in ap
Updated:  2018-03-25 12:58:59

ఏపీలో మరో సంచలనం

ఏపీ రాజ‌కీయాలు గ‌త కొంత కాలంగా తీవ్ర ఉత్కంట రేపుతున్నాయి. దీనికి కార‌ణం రాష్ట్రంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తూ  ఉండ‌డం, ఈ కార‌ణంగా  రాజ‌కీయ పార్టీలు త‌మ ఉనికిని కాపాడుకోవ‌డానికి వ్యూహాలు ర‌చించుకుంటున్నాయి. ప్ర‌తిప‌క్ష వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల్లోకి దూసుకెళుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ అభివృద్దే ప్ర‌ధాన ఎజెండాగా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డానికి ప్ర‌య్న‌త్నిస్తోంది...ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలు, ప్ర‌త్యేక‌హోదా చుట్టూనే తిరుగుతున్నాయి.
 
రాజ‌కీయ పార్టీలు ఒక‌రి పై ఒక‌రు అవినీతి ఆరోప‌ణ‌లు చేసుకుంటున్న విష‌యం అంద‌రికి తెలిసిందే.... ఈ అవినీతి ఆరోప‌ణ‌ల పై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ అయిన సీబీఐ నిఘా పెట్టిన‌ట్లు స‌మాచారం. ముఖ్యంగా అధికార టీడీపీ చేసిన అవినీతికి  ఐదుగురు అధికారులు స‌హ‌క‌రించిన‌ట్లు వారు క‌నుగోన్నార‌ట‌. ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం బట్టి ఇదంతా నిజమే అని సీనియ‌ర్లు అంటున్నారు.
 
ఈ కేసుకు సంబందించి పక్కా సమాచారాన్ని సీబీఐ సేకరించినట్లు వార్త‌లు వస్తున్నాయి.  ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌పార్లమెంట్ స‌మావేశాలు ముగిసిన వెంటనే ఆ ఐయిదుగురు అధికారులపై దాడులు ఉండవచ్చని చెబుతున్నారు. వీరిలో ముగ్గురు ఏపీలో పాలనను శాసించే ముఖ్య అధికారుల‌ని చెబుతున్నారు. మరో ఇద్దరు కీలకమైన శాఖలకు చెందిన ఉన్నతాధికారులు అని వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.
 
ప్ర‌జ‌ల‌ను వేధిస్తూ అవినీతికి పాల్పడడమే కాకుండా.. అధికార టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చ‌డంలో కొంద‌రు ఐఏయ‌స్ అధికారులు ప్ర‌ముఖ పాత్ర వ‌హించిన‌ట్లు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ఇటీవ‌ల వెల్ల‌డించారు. అధికార టీడీపీ గ‌త‌ నాలుగేళ్లలో చేసిన లక్షా 20వేల కోట్ల రూపాయ‌ల అప్పు దేనికి ఖ‌ర్చుచేశారు, అలాగే కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎటువంటి ప‌థ‌కాల‌కు దారి మళ్లించారు అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్ప‌క‌పోవ‌డం కూడా ఓ అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌లుగా స‌మాధానాలు లేని క్వ‌శ్చ‌న్స్ గా ఏపీ స‌ర్కారుకు గుదిబండలా మ‌రాయి.
 
దీనిపై  కేంద్రం లెక్కలు అడిగినా అందుకే ఏదో మ‌త‌ల‌బు వ‌ల్ల  రాష్ట్ర ప్రభుత్వం లెక్క‌లు స‌మాధానాలు  చెప్పలేకపోతున్నట్టు  వారు అనుమానిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చిన సీబీఐ… ఐదుగురు అధికారులపై కన్నేసినట్టు  వార్త‌లు వ‌స్తున్నాయి . వారి ద్వారా మొత్తం కూపీ లాగేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఒకవేళ సీబీఐ దాడులు నిజంగానే ఆ ఐదుగురు అధికారులపై జరిగితే, తెలుగుదేశం స‌ర్కారుకు కాస్త ఇబ్బందిక‌ర ప‌రిస్దితి రావ‌చ్చు ఎన్నిక‌ల వేళ ఇది మ‌రింత ర‌చ్చ‌కావ‌చ్చు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.