లోకేష్ లాంటి ఎంట్రీ ఉండ‌ద‌ట‌?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-15 14:55:54

లోకేష్ లాంటి ఎంట్రీ ఉండ‌ద‌ట‌?

తెలుగుదేశం పార్టీ చెప్పేది ఒక‌టే మా పార్టీని పైకి తీసుకురావ‌డానికి ఆ నాడు చంద్ర‌బాబు ఎంత క‌ష్ట‌ప‌డ్డారో,అలాగే కార్య‌క‌ర్త‌ల సంక్షేమ బాధ్య‌త‌ల నుంచి లోకేష్ పార్టీని పైకి తీసుకువ‌చ్చి పార్టీలో మంత్రి అయ్యార‌ని, తాత‌కు తండ్రికి త‌గ్గ రాజ‌కీయ వార‌సుడు అంటారు.ఇది మ‌హానాడు, మినీ మ‌హానాడు, టీడీపీ ఆఫీసుల్లో చెప్పేమాట. సీనియ‌ర్ మంత్రులు కూడా లోకేష్ కు కితాబిస్తూ ఉంటారు. ప్యూచ‌ర్ సీఎం లోకేష్ అంటూ అప్పుడే ప్ర‌శంస‌లు ఇస్తూ ఉంటారు.
 
జ‌గ‌న్ లాంటి నాయ‌కులు ఏపీలో ఉన్నారు, మ‌న లోకేష్ ప్యూచ‌ర్ సీఎం అభ్య‌ర్ది, మ‌నం ఎమ్మెల్సీగా ఎందుకు నేరుగా ఎమ్మెల్యేగా తీసుకుందాం అని బాబు వెన‌కాల ఉండే నాయ‌కులు, ఆ నాడు స‌ల‌హా ఇచ్చినా, మంత్రుల మాట లెక్క‌చేయ‌లేదు. జెండా రూప‌క‌ల్ప‌న నుంచి తెలుగుదేశంలో ఉన్న నాయ‌కుడి మాట ప‌ట్టించుకోలేదు. ఇక నారాలోకేష్ కు వెంట‌నే ఎమ్మెల్సీ ఆ వెంట‌నే మంత్రి ప్ర‌మోష‌న్ ఇచ్చారు చంద్ర‌బాబు.
 
అయితే తాజాగా కొంద‌రు బీజేపీ నాయ‌కులు చెప్పే ఇంట్ర‌స్టింగ్ న్యూస్, విశ్లేష‌కులు వివ‌రించే స‌మ్ థింగ్ స్పెష‌ల్ న్యూస్ ఏమిటంటే, శాస‌న మండ‌ళ్లు రద్దు చేయాలి అని కేంద్రం ఆలోచిస్తోంది.ఇది ఎప్ప‌టి నుంచో న‌లుగుతున్న అంశం,అయితే అస‌లు ఈ ఎమ్మెల్సీ ప‌ద‌వులు అంటే ముందు కాంగ్రెస్ లో పాతుకుపోయిన విధానం.ఏకంగా సీడ‌బ్ల్యూసీ లెవ‌ల్లో సిఫార్సులు, రిఫ‌రెన్స్ లు ఉండేవి.దీనికి వారు పుల్ స్టాప్ పెట్ట‌లేదు. ఇప్పుడు బీజేపీ ఎన్డీయే ప‌క్షాల‌తో చ‌ర్చించి కొత్త నిర్ణ‌యం తీసుకోవాలి అని అనుకుంటోంది.
 
అస‌లే ఎంపీ సీట్లు 20 నుంచి 15 ద‌క్షిణాదిన కోత‌కు వ‌స్తున్నాయి అనేది ఓ గుదిబండ‌గా మారింది. జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం చూస్తే  ఈ ఎంపీ సీట్ల లెక్క‌లు మారేలా ఉన్నాయి. ఇక నాయ‌కుల‌కు ఎమ్మెల్సీ-రాజ్య‌స‌భ అవ‌కాశాలు సీట్లు ఇచ్చేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి అనుకుంటే, రాజ‌కీయంగా ఈ ఆలోచ‌న కూడా మోదీ స‌ర్కారు తీసుకువ‌చ్చే స్దితిలో ఉంది అని తెలుస్తోంది.
 
అయితే ఇప్పుడు అంద‌రూ చ‌ర్చించుకునేది ఒక‌టే అస‌లు ఎమ్మెల్యేగా కూడా గెల‌వ‌లేని నాయ‌కుల‌ను ఎమ్మెల్సీలుగా తీసుకుని వారికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చే ఈ సీన్ ఏపీలో ప్ర‌జ‌ల‌కు అస్స‌లు న‌చ్చ‌డం లేదు, బ‌హిరంగంగానే చెబుతున్నారు కొంద‌రు ప్ర‌జ‌లు. ఓ సోమిరెడ్డి ఓ నారాయ‌ణ ఓ లోకేష్ ఎలా మంత్రులు అవుతారు అస‌లు ప్ర‌జా నిర్ణ‌యం వ‌ద్దా అనేది ప్ర‌జ‌ల క్వ‌శ్చ‌న్.పెద్ద‌ల స‌భ‌లు లేని రాష్ట్రాలు ఎలా ఉన్నాయో అలాగే ఏపీలో రాజ‌కీయాలు మారాలి అని మ‌రో వ‌ర్గం కోరుకుంటోంది.
 
ఇప్ప‌టికే కేంద్రం కూడా ఈ శాస‌న‌మండ‌ళ్ల ర‌ద్దు కోసం క‌స‌రత్తులు మొద‌లుపెట్టింది అని బీజేపీ చెబుతోంది.అదీ క‌రెక్ట్ ఎందుకంటే రాజ‌కీయ అవ‌స‌రాల కోసం ఓట‌మిపాలైన నాయ‌కులు అటు ఎమ్మెల్సీ ఇస్తే పార్టీ మార‌తాను అనేలా లాబీయింగ్ చేసుకోవ‌డం కూడా ఇటీవ‌ల రాజ‌కీయాల్లో మ‌రింత పెరిగింది. సో శాసన‌మండ‌ళ్లు  కూడా రాజ‌కీయంగా అన్ని రాష్ట్రాల్లో లేవు.ఇలా ఎమ్మెల్సీలు లేని రాష్ట్రాల పాల‌న రాజ‌కీయాలు అక్క‌డ బాగున్నాయి. ఫిరాయింపుల గోల త‌గ్గుతుంది, ఇది ఏపీ తెలంగాణ‌లో అమ‌లులోకి వ‌స్తే మ‌రింత రాజ‌కీయాలు బాగుప‌డ‌తాయి అని కొంద‌రి వాద‌న‌.
 
ప్రస్తుతం శాసనమండలి ఉన్న రాష్ట్రాలు చూస్తే 7..రాష్ట్రాలు ఉన్నాయి(1) ఉత్తరప్రదేశ్ (2) ఆంధ్రప్రదేశ్ (3) తెలంగాణ (4) కర్ణాటక (5) మహారాష్ట్ర  (6) బిహార్ (7) జమ్మూకశ్మీర్.
 
ఇలా చేస్తే తెలుగుదేశంలో చాలా మందికి రాజ‌కీయంగా ఎదురుదెబ్బ త‌గులుతుంది అఫ్ కోర్స్ వైసీపీకి త‌గులుతుంది. అయితే జ‌గ‌న్ దీనికి స‌పోర్ట్ అనే అంటున్నారు కొంద‌రు వైసీపీ నాయ‌కులు. అలాగే ఏ పార్టీకి అయినా త‌గులుతుంది అనేది వాస్త‌వం. అయితే ప్ర‌తిప‌క్ష పార్టీలు ప‌క్క‌న పెడితే ఇలా అధికార పార్టీ ఏకంగా ఎమ్మెల్సీల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చుకుంటూ వెళితే ప్ర‌జ‌ల్లో మ‌రింత వ్య‌తిరేక‌త పెరుగుతోంది.సో రాజ‌కీయంగా బీజేపీ తీసుకునే కొన్నిసెన్సేష‌న‌ల్ డెసిష‌న్స్ లో ఇదీ ఒక‌టి కాబోతోంది త్వ‌ర‌లో దీనిపై ఓ స‌రికొత్త ఆలోచ‌న చేయ‌నుంది బీజేపీ.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.