కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-05 12:21:50

కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

ఏపీకి నిధులు రాక‌పోయినా ప‌ర్వాలేదు, విద్యాసంస్ద‌లు ఇవ్వ‌క‌పోయినా ప‌ర్వాలేదు, స్పెష‌ల్ స్టేట‌స్ కాకుండా స్పెష‌ల్ ప్యాకేజీ ఇచ్చినా పోయింది ఏమీ లేదు, కాని మాకు మా రాజకీయం కోసం నియోజ‌క‌వ‌ర్గాల పెంపు జ‌ర‌గాలి అని ప‌దికి వంద సార్లు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు తెలుగు నేత‌లు.. అధికార పార్టీకి ఇంత ప్రేమ నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఎందుకు అంటే..?  ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు సీట్ల స‌ర్దుబాటుకు, అలాగే తెలుగుదేశంలో ఉన్న వార‌సుల కు లైన్ క్లియ‌ర్ చేయ‌డానికి.. అయితే  కేంద్రం ఆచితూచి ఏపీపై - తెలంగాణ పై అడుగులు వేస్తోంది..
 
తెలంగాణ సీఎం ఎలాగో మోదీకి స‌పోర్ట్ ,ఇటు ఏపీలో చంద్ర‌బాబు అవ‌కాశ‌వాద రాజ‌కీయం చేస్తున్నారు అని క‌మ‌లం పార్టీ గుర్తించింది.. ఇచ్చిన నిధుల‌కు లెక్క‌లు-  బిల్లులు అడిగేస‌రికి వెబ్ సైట్లో ఉన్నాయి వెతుక్కోండి అనేలా స‌మాధానాలు రావ‌డంతో, ఇటు ఏపీ క‌మ‌లం నాయ‌కులు కూడా దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు చేశారు.
 
అయితే ఏపీలో బీజేపీ తెలుగుదేశం క‌లిసి పోటీ చేసినా, బీజేపీకి సీట్లిచ్చినట్లే ఇచ్చి....మ‌ళ్లీ అక్క‌డ టీడీపీ రెబ‌ల్స్ ను నిల‌బెట్ట‌డం ఇది ప‌రిపాటిగా కాదు అలావాటుగా మారుతోంది.... దీంతో ఏపీ క‌మ‌లం నాయ‌కులు ఏపీలో మ‌న ఎదుగుద‌ల ఇలా పొత్తులో సాధ్యం కాదు అని తేల్చేశారు... అయితే ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గాల పెంపు జ‌రుగుతుంది అని చంద్ర‌బాబు నాయ‌కులు చెప్ప‌డంతో, ఇక్క‌డ వార‌సులు సీట్ల‌కోసం టికెట్ల కోసం చూస్తున్న ఆశావాహులు రెడీ అయ్యారు..
 
అయితే వారికి ఓ చేదు వార్త చెప్పారు కేంద్ర‌మంత్రి అరుణ్ జైట్లీ, ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల పెంపు జ‌ర‌గ‌బోద‌ని వ‌చ్చే ఎన్నిక‌ల కు రెండు తెలుగురాష్ట్రాల్లో సీట్ల పెంపు పై ఎలాంటి ప్ర‌క్రియ తాము చెయ్య‌డం లేద‌ని తేల్చిచెప్పారు.. అయితే ఇటు ఆర్ధిక మంత్రి చెప్పడం కాదు... ప్ర‌ధాని - హోం మంత్రి చెపితే క్లారిటీ వ‌స్తుంది అని సైకిల్ పార్టీ నాయ‌కులు అంటున్నారు.
 
!! అంటే అన్నారు అంటారు వీరంద‌రూ ఒకే చెట్టు కొమ్మ‌లు కాదా కేబినెట్లో అరుణ్ జైట్లీ లేరా అంటున్నారు ఇటు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు !!  మొత్తానికి నియోజ‌క‌వ‌ర్గాలు పెంచి తెలుగుదేశంతో సీట్ల స‌ర్దుబాటు చేసుకోవాలి అని బీజేపీకి కూడా ఎటువంటి ఆలోచ‌న‌ లేదు అనేది తేలిపోయింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.