జ‌గ‌న్ కు ఆ నాయ‌కుడు ఫుల్ స‌పోర్ట్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-06 10:27:49

జ‌గ‌న్ కు ఆ నాయ‌కుడు ఫుల్ స‌పోర్ట్ ?

ఏపీలో తెలుగుదేశం పార్టీ కేంద్రం పై వీర‌లెవ‌ల్లో రంకెలు కేక‌లు వేస్తోంది... రాష్ట్రంలో  ఒకే ఒక్క అవ‌కాశం ఇవ్వాలి అని జ‌గ‌న్ ఓ ప‌క్క ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చేస్తుంటే, ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డం లేదు తెలుగుదేశం పార్టీ..  ఏపీలో సైకిల్  పార్టీ అధికారంలోకి వ‌చ్చి సుమారు 40 నెల‌లు గ‌డిచినా, ప్ర‌జా స‌మ‌స్య‌ల పై నేల చూపులు చూస్తున్నారు నాయ‌కులు.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల గురించి ప్ర‌స్తావిస్తుంటే  దానికి స‌మాధానం లేదు.. అలాగే పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌మాధానానికే పొంతన లేదు, వారానికో నాయ‌కుడు ఏదో ఓ వివాదంతో హైలెట్ అవ్వ‌డం భ‌జ‌న మీడియా దానిని క‌ప్పిపుచ్చ‌డం అనేది వైసీపీ ఓ ప‌క్క విమ‌ర్శిస్తున్న అంశం.
 
ఇక జ‌గ‌న్ కు కేంద్రంలో ఎవ‌రో నాయ‌కుడు ఫుల్ స‌పోర్ట్ ఇస్తున్నాడు... ఈ ప‌ని చేస్తున్న ఆ నాయ‌కుడు ఎవ‌రు అని? అస‌లు మ‌నం చెప్పింది వినే క‌మ‌లం పార్టీ ఎందుకు ఇంత డైరెక్ట్ గా మ‌న పై క‌క్ష క‌ట్టింది అనేది అర్ధంకావ‌డం లేద‌ట తెలుగుదేశం అధినేత‌కు... అయితే బ్యాంకుల ఎంపీ, కాంట్రాక్టుల ఎంపీల ను సీక్రెట్ గా ఈ ప‌నికై అప్ప‌గించార‌ట అధినేత.. అస‌లు ఎవ‌రు మ‌న‌పై ఇటువంటి క‌క్ష దోర‌ణికి కూడుకున్నారు అని తెలుసుకోమ‌న్నార‌ట... కాని విచిత్రం విధి వెక్కిరించి ప్ర‌ధాని మోదీనే నేరుగా ఈ ట్రాక్ లోకి వ‌చ్చారు అని స‌మాధానం ఇచ్చార‌ట‌.
 
అడిగిన లెక్క‌ల‌కు స‌మాధానాలు లేక‌పోవ‌డం, మోదీ గ్రాఫ్ ను ఏపీలో నెమ్మ‌దిగా త‌గ్గించ‌డం అనేది కేంద్రం గుర్తించింది.. అందుకే ఏపీలో బాబు గ్రాఫ్ ను త‌గ్గిస్తున్నారు మోదీ జీ అని, సంకేతాలు వ‌స్తున్నాయి ఏపీ సైకిల్ పార్టీకి... అయితే కేంద్రంలో వైసీపీకి ఎవ‌రూ స‌పోర్ట్ లేర‌ని, మ‌న గొయ్యి మ‌న‌మే త‌వ్వుకున్నాం అని కొంద‌రు త‌మ్ముళ్లు గుస‌గుస‌లాడుకుంటున్నారు.
 
!! యెల్లో పంచ్ !!
కాని మ‌న మీడియాలో మాత్రం అదే రాయాలి జ‌గ‌న్ కు కేంద్రంలో ఆ నాయ‌కుడు స‌పోర్ట్ ఉంద‌ని, బీజేపీతో జ‌గ‌న్ మైత్రికై  వెంప‌ర్లు అని వార్త‌లు వైర‌ల్ అవ్వాలి!!

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.