సోము వీర్రాజుకు కేంద్రం బంప‌ర్ ఆఫ‌ర్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-23 15:37:43

సోము వీర్రాజుకు కేంద్రం బంప‌ర్ ఆఫ‌ర్ ?

ఏపీలో అధికారం కోసం ఇటు తెలుగుదేశం ఎన్ని రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు వేస్తున్నా, వైసీపీ పై విమ‌ర్శ‌లు చేస్తున్నా, జ‌న‌సేన‌ని బీజేపీని క‌లిపి తెలుగుదేశం విమ‌ర్శ‌లు చేస్తున్నా ఏపీలో ఎటువంటి రాజ‌కీయం జ‌రుగుతుందో తెలుగుదేశం ఎటువంటి రాజ‌కీయాలు చేస్తుందో అంద‌రికి తెలిసిందే... నాలుగేళ్లుగా బీజేపీ తో చెట్టా ప‌ట్టాలేసుకుతిరిగిన తెలుగుదేశం ఇప్పుడు బీజేప పై  విమ‌ర్శ‌లు చేస్తోంది.. ప‌వ‌న్ ని ముందు ఉంచి బీజేపీ వెనుక ఉండి  రాజ‌కీయాలు చేస్తోంది అనే , విమ‌ర్శ‌లు చేస్తోంది.. ఇవ‌న్నీ సావ‌ధానంగా వింటూ చూస్తూ ఉంది బీజేపీ... కేంద్ర నాయ‌కత్వం అదును చూసి పొలిటిక‌ల్ స్టెప్ వేయాలి అని అనుకుంటున్నారు బీజేపీ నాయ‌కులు అగ్ర‌నేత‌లు.
 
ఇక బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వంలో కూడా క‌రుడు గ‌ట్టిన విమ‌ర్శ‌కులు ఉన్నారు.. తెలుగుదేశం చేసే రాజ‌కీయాల పై ఎప్పుడూ విమ‌ర్శ‌లు చేస్తూ వారి అవినీతిని ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డుతూ ఉంటారు.. వారిలో ముఖ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, అలాగే  పురందేశ్వ‌రి, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ అయితే గ‌త ఆరు నెల‌లుగా ఏపీ బీజేపీ ర‌థ‌సార‌ధి గా వీరిలో న‌లుగురికి ఛాన్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంది అనే వార్త‌లు వినిపిస్తున్నాయి.. హ‌స్తిన‌ల్ పేరు ఫైన‌ల్ అయింది అనే వార్త‌లు వ‌స్తున్నాయి.. అయితే తాజాగా ఎమ్మెల్సీ సోము వీర్రాజుకి ఏపీ బీజేపీ ప‌గ్గాలు ఇచ్చే అవ‌కాశం ఉంది అంటున్నారు నాయ‌కులు.
 
బీజేపీ ఏపీలో బ‌ల‌ప‌డ‌టానికి టీడీపీ ని ఎదుర్కొనే స‌త్తా ఆయ‌న‌కు మాత్ర‌మే ఉంది అని అంటున్నారు... ఇటు విష్ణుకుమార్ రాజు ఎప్పుడూ తెలుగుదేశం పై కాస్త ఘాటుగా విమ‌ర్శ‌లు చేసినా ఆయ‌న ఎమ్మెల్యేగా శాస‌న‌స‌భా బీజేపీ నేత‌గా ఒక్కో సారి బాబు స‌ర్కారుని  ప్ర‌శంసించిన సంద‌ర్బాలు ఉన్నాయి..
 
అయితే సోము వీర్రాజు తెలుగుదేశం పై అనేక సార్లు త‌న ప‌వ‌న్ చూపించారు విమ‌ర్శ‌ల దాడి చేశారు.. అవినీతి పై ఎప్ప‌టిక‌ప్పుడు విమ‌ర్శ‌ల ఘాటు పెంచారు.. ఆయ‌న వాగ్దాటికి బీజేపీ ప‌గ్గాలు ఆయ‌న‌కు అయితే క‌రెక్ట్ అనే భావ‌న తెలుగుదేశానికి ఉంది అంటున్నారు నాయ‌కులు... ఇటు పురందేశ్వ‌రికి ప‌గ్గాలు ఇచ్చినా  ఆమె ఎంపీగా పోటీ చేయ‌డానికి ఉత్సాహం చూప‌డం రాష్ట్ర బీజేపీ పై ఆమె ఎటువంటి పొలిటిక‌ల్ ప్లాన్ అమ‌లు చేయలేరు అని ఆలోచిస్తున్నారు..
 
ఇటు తెలుగుదేశం నాయ‌కులు కోవ‌ర్టులు బీజేపీలో ఉన్నారు అనే విమ‌ర్శ‌లు ఉన్నాయి.. అయితే ఇటు కంభం పాటి హ‌రిబాబు స్థానంలో కొత్త అధ్య‌క్షుడు త్వ‌ర‌లోనే వ‌స్తాడ‌ని క‌మ‌లం పార్టీ క్లారీటీ ఇచ్చేసింది.. అది కూడా సోము వీర్రాజే ఫైన‌ల్ అనే వార్త‌లు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.. ఎమ్మెల్సీగానే సోము వీర్రాజు తెలుగుదేశం చంద్ర‌బాబు మంత్రుల‌పై పెద్ద‌పెద్ద విమ‌ర్శ‌లు చేస్తారు.. ఇక ప‌ద‌విలో మ‌రింత చురుకుగా పార్టీ త‌ర‌పున యాక్టీవ్ గా ఉంటారు అని అంటున్నారు నాయ‌కులు, బీజేపీకి ఇది పెద్ద ప్ల‌స్ అని రాష్ట్ర నాయ‌కత్వం ఆనందంగా ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.