బాబుకు చెక్ పెట్టేందుకు కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-04 18:19:18

బాబుకు చెక్ పెట్టేందుకు కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

నాలుగు సంవ‌త్స‌రాలపాటు బీజేపీతో పొత్తు పెట్టుకుని వ్య‌వ‌హ‌రించిన‌ టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు... పొత్తులో భాగంగా ప్ర‌త్యేక హోదా బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజీకి జై కొట్టారు. అయితే ప్ర‌త్యేక ప్యాకేజీని తీవ్రంగా వ్య‌తిరేకించిన ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విస్రృత స్థాయిలో ప్ర‌త్యేక హోదాపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి వారిలో చైత‌న్యం తీసుకు వ‌చ్చారు.
 
దీంతో హడావుడిగా బీజేపీకి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విడాకులు తీసుకుని తాను ప్ర‌త్యేక ప్యాకేజీకి వ్య‌తిరేకం అని ఏపీకి ఖ‌చ్చితంగా కేంద్రం ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. అందులో భాగంగానే విభ‌జ‌న అంశాల విష‌యంలో మోడీని దోషిగా నిల‌బెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష‌లు చేస్తున్నారు చంద్ర‌బాబు నాయుడు.
 
ఇక స‌భా ముఖంగా చంద్ర‌బాబు చేస్తున్న విమ‌ర్శ‌లకు చెక్ పెట్టేందుకు బీజేపీ నాయ‌కులు అనేక వ్యూహ‌లు ర‌చిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందుకోసం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా లక్ష్మీ నారాయ‌ణ, అలాగే ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు లు క‌లిసి ఇటీవ‌ల‌ కాలంలో బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షాతో స‌మావేశం అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మావేశంలో చంద్ర‌బాబు నాయుడు, మోడీని ఏ విధంగా టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నారో  వాట‌న్నిటిని కొంద‌రు నాయ‌కులు వీడియో క్లిప్ ల‌ను చూపించిన‌ట్లు తెలుస్తోంది.
 
అయితే ఈ నేప‌థ్యంలో అతి త్వ‌ర‌లో అమిత్ షా రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న ఏపీకి వ‌చ్చిన త‌ర్వాత ఉత్తారాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌, కోస్తాలో ప‌ర్య‌టించి భారీ భ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ స‌భ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ కేంద్రంతో ఉమ్మ‌డిగా ఉన్న‌ప్పుడు ప్ర‌త్యేక హోదా బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజీ కావాల‌న్నార‌నే విష‌యాన్ని జ‌నాల్లోకి విస్రృతంగా తీసుకువెళ్లాల‌ని చూస్తున్నారు. 
 
అంతేకాదు కేంద్రం ప్ర‌త్యేక ప్యాకేజీ కేటాయిస్తామ‌ని చెప్పిన‌ప్పుడు చంద్ర‌బాబు నాయుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏ విధంగా పండుగ చేసుకున్నారో వాట‌న్నింటిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు స్క్రిప్ట్ ను కూడా బీజేపీ నాయ‌కులు రెడీ చేసుకుంటున్న‌ట్లు తెలుసుస్తోంది. 
 
ఈ క్ర‌మంలో బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, చంద్ర‌బాబు నాయుడు పై నిప్పులు చెరిగారు. టీడీపీ స‌ర్కార్ నీరు చెట్టు కింద భారీ కుంభ‌కోణానికి పాల్ప‌డ్డార‌ని మట్టిని తవ్వి తీయటానికి రూ. 13,600 కోట్ల ఖర్చును చూపెట్టటం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడును అవినీతి రాక్షసుడిగా అభివర్ణించిన ఆయన పంచభూతాలు కూడా బాబును క్షమించబోవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయ‌నతో పాటు క‌న్నా ఈ మ‌ధ్య కాలంలో విష్ణుకుమార్ రాజు కూడా చంద్ర‌బాబు పై విమ‌ర్శ‌లు చెయ్య‌డంలో త‌న స్పీడును పెంచారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.