టీడీపీకి దారేది?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-07 11:02:56

టీడీపీకి దారేది?

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌ ఏర్ప‌డిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి అమ‌లు చేయాల్సిన విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలు, ప్ర‌త్యేక హోదాను కేంద్ర ప్ర‌భుత్వం విస్మ‌రించింది. ఇటీవ‌ల కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీకి జ‌రిగిన అన్యాయాన్ని మొదులుకుని ప్ర‌స్తుత‌ పార్ల‌మెంట్ స‌మావేశాల వ‌ర‌కూ  రాష్ట్రంలో ఉన్న అన్ని రాజ‌కీయ పార్టీలు ఏక‌ధాటిగా కేంద్రం పై పోరాటం చేస్తున్న విష‌యం అంద‌రికి తెలిసిందే.
 
అయితే కేంద్ర ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర‌ ప్ర‌యోజానాల‌ను నిర్ల‌క్ష్యం చేసి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో కేంద్రం పై నిందవేసి రాష్ట్ర ప్ర‌జ‌లను మెప్పించ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం సాధ్యం కాదంటూ కేంద్రం తేల్చిచెప్పింది. దీంతో మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ మంత్రులు బీజేపీ పై ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
య‌న‌మ‌ల దిల్లీ టూర్ త‌ర్వాత ఏపీలో గ‌ల్లీ గ‌ల్లీ అంతా ఏపీకి ప్ర‌త్యేక హూదా రాదు అనేలా ఆస్ధాన‌మీడియాలు తేల్చేశాయి అయితే తాజాగా ఆర్ధిక శాఖ వ‌ర్గాలు ఏపీకి ఎటువంటి నిధులు ఇస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కూ లెక్క‌లు చెప్ప‌లేదు అనేలా వ్యాఖ్య‌లు చేశారు.
 
అలాగే ఏపీకి నిధుల విడుద‌ల చేశామని 12500 కోట్ల రూపాల‌యల‌కు లెక్క‌లు చెప్ప‌డం లేద‌ని ఆర్దిక శాఖ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక పార్లమెంట్ ను స్దంభింపచేస్తామంటూ టీడీపీ ఎంపీలు ఫ్ల‌కార్డుల‌తో నిర‌స‌న చేయ‌డం మాత్ర‌మే చేస్తున్నారు త‌ప్ప రాజీనామా అనే స‌రికి రాజీకి వ‌స్తున్నారు.. అయితే లెక్క‌లు చెప్ప‌ని తెలుగుదేశానికి ఎందుకు మ‌నం నిధులు ఇవ్వాలి అనేలా కేంద్రం ఆలోచిస్తోంది అని రాజ‌కీయ మేధావులు చెబుతున్నారు.
 
అయితే ఈ స‌మ‌యంలో ఏపీలో క‌మ‌లం పార్టీ నాయ‌కుల‌కు సైకిల్ పార్టీ నాయ‌కుల‌కు మ‌ధ్య‌ వార్ న‌డుస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు అన్యాయం చేస్తే బీజేపీ నాయ‌కులు రాష్ట్రంలో తిర‌గ‌లేర‌ని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు హెచ్చ‌రించారు.... అసెంబ్లీ త‌ర్వాత మీడియాతో మాట్లాడిన టీడీపీ నాయ‌కులు రాష్ట్రంలో బీజేపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అన్నారు.
 
టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న  మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం నిరంత‌రం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీని విమ‌ర్శిస్తే బీజేపీకి రాష్ట్రంలో పుట్ట‌గ‌తులుండ‌వ‌ని అన్నారు. ఈ విమ‌ర్శ‌లు ఎలా ఉన్నా ఏపీలో తెలుగుదేశం పార్టీకి రూటు క‌నిపించ‌డం లేదు.. ఓ ప‌క్క ప్ర‌తిప‌క్ష పార్టీ పోరాటం చేస్తుంటే ఏపీకి ఎటువంటి నిధులు ప్ర‌త్యేక హూదా ఇవ్వ‌క‌పోయినా ఎందుకు కేంద్రంతో ముందుకు వెళుతున్నారు అని  ప్ర‌జ‌లు ఫైర్ అవుతున్నారు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.