ఒక అభ్యర్థి, ఒకే నియోజకవర్గం..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-05 11:25:20

ఒక అభ్యర్థి, ఒకే నియోజకవర్గం..

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరైనా.. ఒక్క నియోజకవర్గంలో మాత్రమే పోటీకి దిగేలా ఆదేశించాల‌ని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన ఒక పిటిషన్ కు కేంద్ర ఎన్నికల సంఘం మద్దతు పలికింది. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ఎన్నికల అభిప్రాయాన్ని కోరగా.... ఒక అభ్యర్థి, ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న నియమం పట్ల తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.
 
ఒక అభ్యర్థి వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు అనుమతించరాదని కోరుతూ బీజేపీ నేత అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ్‌ కొన్ని నెలల కిందట పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ, సీఈసీల అభిప్రాయాలను కోరుతూ కోర్టు నోటీసులు జారీ చేసింది. వాటికి సీఈసీ స్పందించింది. ఒక అభ్యర్థి, ఒకే నియోజకవర్గం ప్రతిపాదనకు తమ సమ్మతిని తెలియజేసింది.
 
ఓట‌మి భ‌యంతోనో, ప‌ద‌వి వ్యామోహం కోస‌మో తెలియ‌దుకాని రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తున్నారు కోంద‌రు నేత‌లు. ఈ జాబితాలో ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లతో సహా అనేక మంది ప్రముఖ నేతలున్నారు. 2014 లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కూడా మోడీ వడోదరా, వారణాసి ఎంపీ సీట్ల నుంచి పోటీ చేశారు. రెండు చోట్లా గెలిచారు. వడోదర సీటుకు రాజీనామా చేశారు. ఆ వెంటనే ఆ స్థానానికి ఉప ఎన్నికలు జరపాల్సి వచ్చింది. ఇక కేసీఆర్ కూడా ఎంపీ సీటుకు, ఎమ్మెల్యే సీటుకు పోటీ చేశారు. తెలంగాణ సీఎం పదవిని చేపట్టి ఎంపీ సీటుకు రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు జరపాల్సి వచ్చింది.
 
ప్రస్తుతం జరుగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీచేయ‌డానికి సిద్దం అవుతున్నారు ఇరు పార్టీ నాయ‌కులు. ఇలాంటి వాళ్లు రెండు చోట్లా గెలిస్తే ఒక సీటుకు వెంటనే రాజీనామా చేయాల్సి ఉంటుంది, ఆ సీటుకు తిరిగి 6నెల‌ల్లో ఉప ఎన్నిక జ‌రిపించాలి కాబ‌ట్టి దీనికి అదనపు ఖర్చుగా అవుతుండ‌డం వ‌ల్ల ఇలాంటి పద్ద‌తిని తొలిగించాలని పిటిషనర్ సుప్రీం కోర్టును  కోరారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.