కేంద్ర‌మాజీ మంత్రి మృతి ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-14 10:59:58

కేంద్ర‌మాజీ మంత్రి మృతి ?

ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల వారికి సుప‌రిచితుడు, ప‌శ్చిమ‌గోదావ‌రి నుంచి ఎంపీగా ప‌లుసార్లు గెలిచిన రాజ‌కీయ వ్య‌క్తి.. రాష్ట్రరాజ‌కీయాల్లో కీల‌క నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి తణుకు ఆంధ్రా షుగర్స్‌ ఎండీ బోళ్ల బుల్లిరామయ్య మృతిచెందారు... ఆయ‌న వ‌య‌సు 91 సంవ‌త్స‌రాలు.. ఆయ‌న గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు.. ఈ స‌మ‌యంలో బుధ‌వారం ఉద‌యం ఆయ‌న హఠాన్మ‌ర‌ణం చెందారు
 
1923 జూలై 9 వ తేదిన తూర్పుగోదావ‌రి జిల్లా తాటిపాక‌లో ఆయ‌న జ‌న్మించారు.. 1984, 1991, 1996, 1999లో ఏలూరు నుంచి ఎంపీగా పనిచేశారు. ఆ త‌ర్వాత  1996-98 మధ్య బోళ్ల  బుల్లిరామయ్య కేంద్ర వాణిజ్య శాఖ సహాయమంత్రిగా పనిచేశారు.
ఆయ‌న మృతిప‌ట్ల తెలుగుదేశం నాయ‌కులు ప‌లు రాజ‌కీయ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు.. జిల్లాకు చెందిన మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ‌, దేవాదాయ‌శాఖ‌మంత్రి పైడికొండ‌ల మాణిక్యాల‌రావు,  మంత్రి కే ఎస్ జ‌వ‌హ‌ర్ ఆయ‌న మృతిప‌ట్ల సంతాపం తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.