అరుణ్‌జైట్లీ కీలక ప్రకటన

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-06 05:27:40

అరుణ్‌జైట్లీ కీలక ప్రకటన

మొత్తానికి ఏపీకి అన్యాయం జ‌రిగింది, ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు  నాలుగు సంవ‌త్స‌రాల నుంచి ఎటువంటి న్యాయం జ‌ర‌గ‌లేదు  అని ఎంపీలు చేసిన ఆందోళ‌న పై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రకటన చేశారు. విభజన చట్టానికి తాము కట్టుబడి ఉన్నామని, విభజన చట్ట ప్రకారం ఏపీకి చాలా సంస్థలు ఇచ్చామని ఆర్థికమంత్రి జైట్లీ తెలిపారు. అలాగే దేశంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం 60:40 నిష్పత్తిలో నిధుల సాయం చేస్తుందని అన్నారు... ఇక ప్ర‌త్యేక హోదా ఉన్న రాష్ట్రాల‌కు 90 శాతం నిధులు కేంద్రం అందిస్తుంద‌ని ఆయ‌న అన్నారు.
 
కేవ‌లం ప్ర‌త్యేక హోదా ఉన్న రాష్ట్రాల‌కు, ప్ర‌త్యేక హోదా లేని రాష్ట్రాల‌కు వ్య‌త్యాసం 30 శాతం మాత్ర‌మే అని అన్నారు అరుణ్ జైట్లీ.. ఈ 30శాతం నిధుల మొత్తాన్ని ప్రత్యేక ప్యాకేజీ రూపంలో వివిధ మార్గాల్లో చెల్లిస్తున్నామని జైట్లీ తెలిపారు.
 
ఏపీకి ఉన్న రెవెన్యూ లోటుకు సంబంధించి రూ. 3,900 కోట్లు ఇప్పటికే చెల్లించామని మంత్రి వెల్ల‌డించారు..అలాగే ఏపీకి ఇవ్వ‌వ‌ల‌సిన నిధుల గురించి చ‌ర్చించేందుకు, ఏపీ ఆర్ధిక శాఖ కార్య‌ద‌ర్శిని  ఢిల్లీకి పిలిపిస్తామని జైట్లీ తెలిపారు. అలాగే  రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ విశాఖ రైల్వేజోన్‌ అంశంపై స్పందించారు. విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నామని, ఇతర రాష్ట్రాలతో చర్చించి.. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటామని మంత్రి గోయల్‌ తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.