మంత్రుల పై కేంద్రం ఫోక‌స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

central ap tdp ministers
Updated:  2018-04-10 16:22:29

మంత్రుల పై కేంద్రం ఫోక‌స్

సీఎం చంద్ర‌బాబు ముందు నుంచి చెప్పేది ఒక‌టే...  అదే జ‌రిగేలా క‌నిపిస్తోంది ఏపీ రాజ‌కీయాల్లో.. మ‌రీ ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు త‌న పై ఏ అవినీతి మ‌రకా లేదు ఐయామ్ నిప్పు అంటారు... అయితే 18 స్టేలు ఎందుకు తెచ్చుకున్నారో  మాత్రం స‌మాధానం రాదు, కేసుల విచార‌ణ  ముందుకు న‌డ‌వ‌దు.
 
అయితే ఏపీలో రాజ‌కీయం వేడి ఎక్కుతోంది.. త‌న‌పై కేసులు పెట్టి వేధించినా ఆశ్చ‌ర్యపోవ‌క్క‌ర్లేదు అని తెలియ‌చేశారు సీఎం చంద్ర‌బాబు.. మంత్రులు ఎమ్మెల్యేలు ఎటువంటి విప‌త్క‌ర రాజ‌కీయ ప‌రిస్దితి వ‌చ్చినా సిద్దంగా ఉండాలి అని తెలియ‌చేశారట‌.. అయితే ఎందుకు చంద్ర‌బాబు ఇలాంటి మాట మాట్లాడారు అనేది ఇక్క‌డ చ‌ర్చించుకుంటున్న అంశం..
 
ఇక సీఎం చంద్ర‌బాబు రాజ‌కీయంగా అనేక ఎత్తులు వేస్తారు అనే పేరుంది... అయితే ఇక్క‌డ అవినీతి జ‌రుగ‌కుండా ఎందుకు బీజేపీ ఆయ‌న పై  క‌క్ష క‌డుతుంది.. వారి పార్టీ పై ఫోక‌స్ పెడుతుంది.... ఆయ‌న అన్నా దాని వెనుకరీజ‌న్ ఏమిటి అనేది వైసీపీ ప్ర‌శ్న‌.. ముఖ్యంగా న‌లుగురు మంత్రులపై కేంద్రం ఫోక‌స్ చేసింది అని తెలుస్తోంది ఏపీకి సంబంధించిన ఓ ఐఎఎస్ ఆఫీస‌ర్ కేంద్రంలో ఓ సీనియ‌ర్ నాయ‌కుడికి ఇక్క‌డ జ‌రిగిన అవినీతి అక్ర‌మాల గురించి ఇంట‌ర్న‌ల్ స‌మాచారం సేక‌రించి ఆ వివ‌రాలు అందించారు అని తెలుస్తోంది.
 
స‌ద‌రు ఆఫీస‌ర్ పేరు బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ట బీజేపీ నాయ‌కులు... పూర్తి వివ‌రాల‌తో ఏపీలో న‌లుగురు మంత్రుల పై ఓ ఎమ్మెల్యే పై చ‌ర్య‌ల‌కు కేంద్రం రెడీ అవుతోంది... అయితే ఆ ప్లాన్ తో పావులు ఏపీలో ఎవ‌రితో క‌దుపుతారో అనేది ఇప్పుడు పెద్ద ఆలోచ‌న‌గా మారింది... అయితే తెలుగుదేశంలో న‌లుగురు స‌దరు మంత్రులు మాత్రం ఆలోచ‌న‌లో ఉన్నార‌ని చ‌ర్చించుకుంటున్నారు.
 
ఒక వేళ మంత్రుల పై కేంద్రం ఎటువంటి చ‌ర్య‌లు తీసుకున్నా ప్ర‌త్యేక హూదా కావాల‌ని ఏపీ నుంచి తెలుగుదేశం కోర‌డంతో కేంద్రం క‌క్ష క‌ట్టి ఇటువంటి రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు వేస్తోంది అని చెప్ప‌డానికి సీఎం చంద్ర‌బాబు రెడీ అవుతున్నారు అని విశ్లేష‌కులు భావ‌న... మ‌రి చూడాలి స‌ద‌రు న‌లుగురు మంత్రులు అవినీతి ఏ స్ధాయిలో  చేశారు? అస‌లు వారి అవినీతి పై ఇలాంటి రాజ‌కీయ పరిస్దితుల్లో బీజేపీ క‌దిల్చే సాహాసం చేస్తుందా అనేది చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.