రంగంలోకి సీబీఐ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-22 13:36:33

రంగంలోకి సీబీఐ

వైసీపీ పై ప‌సుపు నీళ్లు చ‌ల్లడం చాలా తెలిక తెలుగుదేశానికి... ఇప్పుడు ట‌న్నుల కొద్ది ప‌సుపు గ్యాలెన్ల కొద్దీ నీళ్లు తెలుగుదేశం పై చ‌ల్లేందుకు రెడీ అవుతోంది కేంద్రం అని తెలుగుదేశం నాయ‌కులు మద‌న ప‌డుతున్నారు.. ఇక అసెంబ్లీలో కూడా చంద్ర‌బాబు ఇదే ఫార్మూల చెప్పారు, నాయ‌కుల‌ను భ‌య‌పెట్టాలి అంటే కుద‌ర‌దు ఆంధ్రా నాట్ ఏ త‌మిళ‌నాడు... దిస్ ఈ జ్ టూ డిఫ‌రెంట్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంటారు... అదే ఫార్మూలా బాబు ఎందుకు అసెంబ్లీలో అసంద‌ర్బంగా వాడారో తెలియ‌దు.. సో ఇప్ప‌డు రాజ‌కీయంగా ఇక్క‌డ చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం ఇదే.
 
కేంద్రం ఎవ‌రిని చెప్పు చేత‌ల్లో ఉంచుకోవ‌డం లేద‌ని, కేసులు ఉంటే వారే వెళ్లి కేంద్రం ద‌గ్గ‌ర మొక్కుకుంటున్నారు అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.. అయితే ఇప్పుడు కేసుల గొడ‌వ ఎలా ఉన్నా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు తెలుగుదేశానికి కాస్త చెమ‌ట‌లు ప‌ట్టించాయి అనే చెప్పాలి.. లోకేశ్ ని సీఎంగా చేయాలి అని తెలుగుదేశం నాయ‌కులు అంద‌రూ ఆలోచ‌న‌లు, టీడ‌బ్లూసీ స‌మావేశాలు పెట్టుకుంటుంటే సైకిల్ గాలి తీసేశాడు ప‌వ‌న్... దీంతో తెలుగుదేశం ఎంత మైలేజ్ నింపుదామ‌నుకున్నా కుద‌ర‌డం లేదు.. రాజ‌కీయంగా ప‌వ‌న్ నాలుగేళ్లు స‌పోర్ట్ చేసి 40 ఏళ్లు అయినా తుడుచుకోలేని పెద్ద మ‌ర‌క వేసేశాడు, అయితే దీనిని ఖండిస్తే ఓ బాధ కండించ‌క‌పోతే ఓ బాధ ఇది తెలుగుదేశం ఘోష‌.
 
ఇటు తెలంగాణ‌లో ఈ అరాచ‌కం ఏమీ లేదు, అంతా రాజ‌కీయం బాగానే న‌డుస్తోంది... కేసీఆర్ - కేటీఆర్ పై కాంగ్రెస్ కేవ‌లం విజ‌యం కోస‌మే కామెంట్లు అవినీతి ఆరోప‌ణ‌లు అంటూ ప్ర‌జ‌లు కొట్టిపారేస్తున్నారు... కాని ఇక్క‌డ ఏపీలో చాలా క‌నిపిస్తున్నాయి, తెలుగుదేశం సెంట‌ర్ అవ్వ‌డం, ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు దొర‌క‌డం... అర్ధ‌రూపాయి వాటా అంటూ పంప‌కాల గురించి నేరుగా మంత్రులు చెప్ప‌డం... ఇవ‌న్నీ టీడీపీని ఇరుకున పెడుతున్నాయి... ఇవ‌న్నీ ఆధారాల‌తో కేంద్రం రంగంలోకి దిగ‌నుంది అని తెలుస్తోంది .. ఏపీలో అవినీతి రూపుమాపాలి అని ప్ర‌క్షాళ‌న దిశగా అడుగులు వేస్తోందా. ఇక్క‌డ నుంచి కీల‌క స‌మాచారం తీసుకువెళుతున్న వేగుల‌ను నియంత్రించలేక‌పోతోంది అని అంటున్నారు కొందరు సీనియ‌ర్లు.
 
ముఖ్యంగా ఆరుగురు మంత్రుల‌ను ప‌లువురు ఎమ్మెల్యేల‌ను , మంత్రి లోకేశ్ పైనా కేంద్రం టార్గెట్ పెట్టింది అనే వార్త‌లు ఏపీ పొలిటికల్ కారిడార్లో వినిపిస్తున్నాయి. ఇక సీబీఐ విచార‌ణ జ‌రిగితే అది తొంద‌ర‌గా తేలాలి, అయితే జ‌గ‌న్ పై కూడా ఇలానే విచార‌ణ అంటూ ద‌శ‌కం పూర్తి చేశారు.. ఇప్పుడు లోకేష్ పై మంత్రుల పై ఇదే బీజేపీ టార్గెట్ అని తెలుగుదేశం నాయ‌కులు అంటున్నారు.
 
అయితే జ‌గ‌న్ కూడా ఇలానే అన్నారు త‌ప్పులేక‌పోయినా అక్ర‌మంగా కేసుల్లో ఇరికించారు అని... సో ఇప్పుడు కూడా రాజ‌కీయం ఇలానే సాగుతోంది లోకేష్ సెంట‌ర్ అవుతారు చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కూడా సీబీఐ విచార‌ణ ఎదుర్కొంటారా కొంద‌రు చ‌ర్చ‌లు కొంద‌రి మాటలు వింటుంటే నిజం అని తెలుస్తోంది.. అయితే ఈ కేసులు కోర్టుకు వెళ్లే హీరోలు ఐకాన్ లు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో ఎవ‌రు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ఇటు వైసీపీ వెళుతుందా లేదా బీజేపీ వెళుతుందా అనేది చూడాలి అయినా జ‌న‌సేన వెళ్లినా ఆశ్చ‌ర్య‌పోవ‌క్క‌ర్లేదు అనేది జ‌గ‌మెరిగిన స‌త్యం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.