బాబు పై కేంద్రం మొద‌టి స్టెప్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-17 18:13:25

బాబు పై కేంద్రం మొద‌టి స్టెప్

ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకుల్లో డబ్బుల్లేవ్‌.. ఎటిఎంలు ఖాళీ అయ్యాయి... ఈ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దేశంలో మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌కే ఎక్కువ నిధులు వెళ్లగా, అవేవీ ప్రస్తుతం బ్యాంకుల్లో కనిపించకపోవడానికి కారణాలేమిటో పరిశీలించాలని కేంద్రం నిర్ణయించింది. పంపిన సొమ్ము పంపినట్టే పోతోందని, ఎవరి చేతుల్లోకి వెళ్లిందో కూడా తనిఖీ చేయాలని కేంద్రం ఆదేశించినట్లు సమాచారం. 
 
రాష్ట్రంలో ఇటువంటి ప‌రిస్దితి ఏర్ప‌డ‌టానికి కార‌ణం ఏమిటో అని బీజేపీ ఆలోచిస్తోంది..ఈ పరిస్థితిపై బిజెపి నాయకత్వమూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి వినతిపత్రం సమర్పించింది... అస‌లు రాష్ట్రంలో వ‌చ్చిన డ‌బ్బులు ఎక్క‌డిక‌క్క‌డ లేకుండా పోతున్నాయి అని అస‌లు ఇంత న‌గ‌దు ఏమి అవుతుందో తెలియ‌డం లేద‌ని కొంద‌రి చేతుల్లో ఈ డ‌బ్బు వెళ్లిపోతోంది అని ఫిర్యాదుచేశారు. బ్యాంకుల్లో డ‌బ్బులు లేక ఏటీఎంల‌లో డ‌బ్బులు లేక ప్ర‌జ‌లు అవ‌స్ద‌లు ప‌డుతున్నారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
అయితే ఇప్పటి వరకూ రాష్ట్రానికి సుమారు రూ.20 వేల కోట్ల వరకూ పంపించామని, దేశంలో ఎవరికీ ఇంత సొమ్ము పంపించలేదని కేంద్ర మంత్రి ఈ నాయకులకు చెప్పినట్లు తెలుస్తోంది.. అయితే ప‌లు కార‌ణాలు కీల‌క విష‌యాలు కూడా తెలియ‌చేశారు అని తెలుస్తోంది.
 
అయితే ఇక్క‌డ బీజేపీ గ‌మ‌నించిన అంశం ఒక‌టి ఉంది ద‌క్షిణాది ర‌ష్ట్రాల్లో అమ‌రావ‌తిలో ఎందుకు ఇటువంటి ప‌రిస్దితి ఏర్ప‌డింది అని ఆలోచిస్తున్నారు..నగదు రద్దు సమస్యల పరిష్కారం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీకి కూడా చంద్రబాబే చైర్మన్‌గా ఉన్నారని, ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన డబ్బు మాయం అవడంపై విచారణ జరిపించాలని బిజెపి నాయకత్వం కోరింది. త్వరలోనే ఈ విచారణ మొదలవనుందని తెలిసింది. 
 
ఎంత డ‌బ్బు వ‌చ్చింది ఎవ‌రి అకౌంట్ల‌లో ఎక్కువ జ‌మ అయింది.. ఎవ‌రి ఖాతాల నుంచి న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ జ‌రిగింది ఎప్పుడు ఎవ‌రి ఖాతాల నుంచి ఎంత డ‌బ్బు డ్రా చేశారు అని బ్యాంకుల నుంచి తెలియ‌చేశారు....రాష్ట్రానికి పంపించిన డబ్బు తమిళనాడుకు వెళ్లిపోయిందనే అనుమానాన్ని బిజెపి రాష్ట్ర నాయకులు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఆర్‌బిఐ పంపించిన మొత్తానికి ఇక్కడ జరుగుతున్న లావాదేవీలకు పెద్దగా తేడా లేదని, అయినా ఇప్పుడు సమస్య ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని జైట్లీ కూడా వ్యాఖ్యానించినట్లు సమాచారం. 
 
చంద్రబాబు చైర్మన్‌గా ఉండటం వల్ల తొలిలో కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ డబ్బు వెళ్లిందని, అయినా తాము అభ్యంతరం చెప్పలేదని, వెళ్లిన డబ్బంతా కొద్దిమంది చేతుల్లోకి చేరిందని తమకూ అనుమానంగా ఉందని, విచారణలో ఇవన్నీ వెలుగులోకి వస్తాయని బిజెపి నాయకులు చెబుతున్నారు. 
 
ఇటీవల రాష్ట్రంలో డబ్బు సమస్య తలెత్తడంతో అసలు డబ్బు ఏమైందనే చర్చ సాగుతోందని, ఈ విచారణలో కొద్దిమంది వ్యక్తులకు డబ్బు చేరిందని తేలితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని, బ్యాంకర్లపైనా చర్యలుంటాయని బిజెపి ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే ఇక ఎన్నిక‌ల‌కు ఓ సంవ‌త్స‌రం స‌మ‌యం ఉండ‌టం ప‌వ‌న్ కూడా ఒక్కో ఎమ్మెల్యే వ‌చ్చే ఎన్నిక‌ల కోసం 25 కోట్ల రూపాయ‌లు సిద్దం చేస్తున్నారు అనేలా మాట్లాడటం చూస్తంటే సమ్ థింగ్ స‌మ్ థింగ్ అంటున్నారు విశ్లేష‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.