బాబు లీకేజీ డ్రామాలకు తెర‌దించిన కేంద్రం..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-15 02:20:06

బాబు లీకేజీ డ్రామాలకు తెర‌దించిన కేంద్రం..?

ఏపీలో కొన్ని మీడియాలు తెలుగుదేశం వెర్ష‌న్ ను నెగిటీవ్ ను పాజిటీవ్ గా చూపిస్తాయి అని ముద్ర‌వేసుకున్న సంగ‌తి తెలిసిందే.. అయితే ఆ మీడియాల ఆట క‌ట్టే ప‌నిలో గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా సోష‌ల్ మీడియా రంగంలోకి దిగింది. నిజాల్ని నిజాలుగా చూపిస్తోంది సోష‌ల్ మీడియా, అయినా వ‌క్ర‌భాష్యాల‌కు కల కదం తొక్కుతోంది ఆస్దాన‌మీడియా.
 
ఈ ఎల్లో మీడియాకి 100 రెట్లు సోష‌ల్ మీడియా దూసుకుపోతోంది.. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో తెలుగుదేశం మీడియా కూడా త‌న ప్రాభ‌వాన్ని త‌గ్గించుకుంది.. అయితే మినిట్ టు మినిట్ తెలుగుదేశం నాయ‌కులు ఎటువంటి కామెంట్ సెంట్ర‌ల్ పై మోదీ పై చేసినా, ఏపీ క‌మ‌లం నాయ‌కులు అన్నింటిని సేక‌రిస్తున్నారు.. మొత్తం మీడియాల‌లో వ‌స్తున్న వార్త‌లు శాటిలైట్ స్ట్రీమ్ మీడియాలో వ‌స్తున్న‌క‌థ‌నాల‌ను కేంద్రానికి ఎప్ప‌టిక‌ప్పుడు పంపిస్తున్నారు, అని చ‌ర్చించుకుంటున్నారు.
 
కావాల‌నే ఏపీలో బీజేపీ ఎదుగుద‌ల‌కు బ్రేక్ వెయ్యాలి అని తెలుగుదేశం ఆడుతున్న‌నాట‌క‌మ‌ని తెలుగుదేశం నాయ‌కుల‌పై కామెంట్లు చేస్తున్నారు బీజేపీ నాయ‌కులు.. అస‌లు త‌మ‌కు గుర్తింపు రాకూడ‌దు అనే ఉద్దేశ్యంతో తెలుగుదేశం నాయ‌కులు చేస్తున్న చ‌ర్య‌లు అని, ఏపీ బీజేపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు.. ఇటు డిజిటల్ మీడియాలో బీజేపీ కూడా దేశంలో నంబ‌ర్ వ‌న్ పొజిషన్ లో ఉంది.. దీంతో తెలుగుదేశం డిజిట‌ల్ సోష‌ల్ మీడియా క‌థ‌నాలు అన్నింటిని ప‌రిశీలిస్తున్నారు అని, కేంద్రంలో ఓ కీల‌క నాయ‌కుడికి ఈ వివ‌రాలు అందిస్తున్నారు అని చ‌ర్చించుకుంటున్నారు....  అయితే మోదీ పై ఎటువంటి కామెంట్లు చేసినా, ఇన్ని వేల కోట్ల రూపాయ‌ల నిధులు ఏపీకి ఇచ్చినా, బీజేపీ పై ఎందుకు తెలుగుదేశం విమ‌ర్శ‌లు చేస్తోందో తెలియ‌డం లేదు అని అంటున్నారు బీజేపీ నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.