తోక ముడిచిన టీడీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

yanamala ramakrishnudu and kala venkatrao image
Updated:  2018-03-11 11:27:50

తోక ముడిచిన టీడీపీ

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెట్టి స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం తెలుగుదేశం పార్టీ ప్ర‌య‌త్నిస్తోంద‌న్న విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే అది మ‌రోసారి బ‌హిర్గ‌త‌మైంది. రాష్ట్ర విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేవ‌లం ప్ర‌త్యేక‌హోదా ద్వారానే అభివృద్ది కావ‌డానికి అవ‌కాశం ఉంటుంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న‌ ప్ర‌భుత్వం రాష్ట్రానికి ప్ర‌త్యేక‌హోదా అమ‌లు చేయ‌డంలో విఫ‌లం అయింది. అదే విధంగా కేంద్ర‌ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న రాష్ట్ర‌ప్ర‌భుత్వం ప్ర‌త్యేక‌హోదా సాధించుకోవ‌డంలో ఘోరంగా వైఫ‌ల్యం చెందింది. రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యేక‌హోదా కోసం గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా నిర్విరామంగా పోరాటం చేస్తోంది.
 
ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప్ర‌త్యేక‌హోదా కోసం అన్ని రాజ‌కీయ పార్టీలు పోరాడుతున్నాయి.  ప్ర‌తిప‌క్ష వైసీపీ ఎంపీలు పార్ల‌మెంట్ వేదిక‌గా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనికి అధికార టీడీపీ మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని వైసీపీ ఎంపీలు కోరారు. దీని పై సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, టీడీపీ కీలక నాయకుల సమావేశం జరిగింది. అనంతరం కళావెంకట్రావు, యనమల విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రవేశపెట్టే అవిశ్వాసానికి తామెందుకు మద్దతిస్తామని మంత్రులు ప్రశ్నించారు.
 
ఎన్డీయేలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ ఎలా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతార‌ని అన్నారు. బీజేపీతో కొనసాగుతూనే హోదాతో సహా విభజన హామీల కోసం పోరాడతామని చెప్పారు. అయితే హోదా కోసం కేంద్ర మంత్రి వ‌ర్గంలో నుంచి వైదొలిగిన టీడీపీ ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌డాన్ని ప్ర‌జ‌లు ఏవిధంగా స్వీక‌రిస్తారో చూడాలి. మొత్తానికి కేంద్రం దెబ్బ‌కి టీడీపీ ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంద‌న్న‌ విష‌యం స్ప‌ష్టం అవుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.