బాబుపై కేంద్రం భారీ స్కెచ్ ఇక ప్ర‌యాణం ఎటు వైపో

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-13 16:52:49

బాబుపై కేంద్రం భారీ స్కెచ్ ఇక ప్ర‌యాణం ఎటు వైపో

నాలుగేళ్ల బంధం తెగిపోయిన త‌ర్వాత ఏపీలో భార‌తీయ జ‌న‌తా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉప్పునిప్పులా మారింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అవినీతిపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల త‌ర్వాత క‌మ‌ల‌నాధులు బాబు అరాచ‌కాల‌ను ఎండ‌గ‌డుతున్నారు. అబ‌ద్దాలు ప‌దేప‌దే చెబితే నిజాలు అవుతాయి అని న‌మ్మించడంలో చంద్ర‌బాబు ఆరితేరార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక ఈ నేప‌థ్యంలో ఆధారాల‌తో స‌హా బాబు అవినీతిని బ‌య‌టపెడుతున్నా కూడా ఎలాగొలాగా మ్యానేజ్‌ చేస్తూ వస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 
 
అయితే కేంద్రం రాష్ట్రానికి ఉత్తచేతులు చూపించింద‌ని చంద్రాబునాయుడు ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అనుకూల ఎల్లో మీడియా ద్వారా ప్ర‌చారం చేసుకుంటూ వ‌స్తున్నార‌ని క‌మ‌ల‌నాధులు గుర్తించారు. దీంతో కేంద్ర ప‌థ‌కాలు రాష్ట్రానికి ఇచ్చిన నిధుల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని పోల‌వ‌రం ప్రాజెక్ట్  ప‌రిసీల‌న‌కు వ‌చ్చిన నితిన్ గ‌డ్క‌రీ దిశా నిర్ధేశం చేశారు.
 
పోల‌వ‌రం ప్రాజెక్ట్ సంద‌ర్శ‌న తర్వాత రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌తో కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా అలిపిరిలో అమిత్ షాపై అలాగే అనంత‌పురంలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌పై టీడీపీ నేత‌ల దాడుల‌ను గ‌డ్క‌రీ దృష్టికి తీసుకువెళ్లారు క‌మ‌ల‌నాధులు. అయితే ప‌చ్చ‌నేత‌ల దాడుల‌పై బ‌య‌పడాల్సిన ప‌నిలేద‌ని త్వ‌ర‌లోనే అన్ని సెటిల్ అవుతాయ‌ని ధైర్యం నూరిపోశార‌ట‌. 
 
అంతేకాదు పార్టీ నేత‌ల‌పై దాడులు చేస్తుంటే బీజేపీ జాతీయ అధిష్టానం చేతులు క‌ట్టుకుని కూర్చోద‌ని తేల్చి చెప్పార‌ట‌. స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకుంటామ‌ని గ‌డ్క‌రీ హామీ ఇచ్చార‌ట‌. అంతేకాదు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న సీసీ రోడ్లు, నీరు చెట్టు, 24 గంటల క‌రెంట్, టాయిలెట్స్, పేద‌లకు ఇళ్లు, విద్యాసంస్థ‌ల కేటాయింపుపై మ‌రింత‌ అవ‌గాహ‌న‌ క‌ల్పించాల‌ని గ‌డ్క‌రీ సూచించార‌ట‌. 
 
పోల‌వ‌రం కేంద్ర ప్ర‌భుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్ట్ అని దీనికి అయ్యే వ్య‌యం అంతా కేంద్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని ప్ర‌జ‌ల్లో విసృతంగా ప్ర‌చారం చెయ్యాల‌న్నార‌ట‌. అంతేకాదు పోల‌వ‌రంలో జ‌రుగుతున్న అవినీతిని అంచ‌నాల పెంపు ఇష్టానుసారం నామినేష‌న్ ప‌ద్ద‌తిపై అలాగే కాంట్రాక్ట్ ల కేటాయింపు పోల‌వ‌రం ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌న్నార‌ట‌. ఇక నుంచి ఏపీ పైన బీజేపీ అధిష్టానం ప్ర‌త్యేక దృష్టి పెడుతుంద‌ని కేంద్ర‌మంత్రులు, పెద్ద‌లు రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తార‌ని, క‌మ‌ల‌నాధులకు గ‌డ్క‌రీ హామీ ఇచ్చార‌ని స‌మాచారం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.