కేంద్రం కీల‌క ప్ర‌క‌టన.......ఇచ్చేది లేదు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

arun jaitley image
Updated:  2018-03-07 06:25:58

కేంద్రం కీల‌క ప్ర‌క‌టన.......ఇచ్చేది లేదు

కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ ఏపీపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.. ఏపికి ప్ర‌త్యేక హూదా కుద‌ర‌దు అని అన్నారు. ఇక ఇచ్చేది లేదు అని తేల్చిచెప్పారు..ప్ర‌స్తుతానికి ప్ర‌త్యేక హూదా ఏ రాష్ట్రానికి లేదు అని అన్నారు..ఈశాన్యరాష్ట్రాల‌కు స్పెష‌ల్ స్టేట‌స్ ఇవ్వ‌డం ఆన‌వాయితీ అలా ఇస్తున్నాం, వారికి ఆర్దిక ప‌రిస్దితి బ‌ట్టీ ఇస్తున్నాం. ఆ  రాష్ట్రాల‌కు 90 శాతం నిధులు ఇస్తున్నాం అని అన్నారు.
 
ఆ ప్ర‌యోజ‌నాలు ఏమిటి. స్పెష‌ల్  స్టేట‌స్ వ‌ల్ల వ‌చ్చేది ఏమిటి అని ఆయ‌న ప్ర‌శ్నించారు... ఏపీకి ఇష్టం లేని విభ‌జ‌న జ‌రిగింది అని ఆయ‌న తెలియ‌చేశారు... ఏపీ ఆదాయాన్ని కోల్పోయింది... కొన్ని రోజుల పాటు రెవెన్యూ లోటు భ‌ర్తీ చేస్తాం అన్నారు...ఐదు సంవ‌త్స‌రాల పాటు కేంద్రం నిధులు 90 శాతం ఇస్తుంది.
 
జీఎస్టీలో కేంద్రం రాష్ట్ర‌ వాటాలు ఉంటాయి... విభ‌జ‌న వ‌ల్ల ఏపీకి అన్యాయం జ‌రిగింది అని అన్నారు అరుణ్ జైట్లీ.. స్టేట‌స్ అనే మాట లేకుండా సాయం చేస్తున్నాం....విదేశీ సంస్ద‌లు ఇచ్చే వాటిలో కేంద్రం 90 శాతం చెల్లిస్తుంది. కొన్ని రోజుల పాటు రెవెన్యూలోటు భ‌ర్తీ చేస్తాం అని తెలియ‌చేశారు..ఏపీలో చ‌ర్చించి ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించామ‌ని తెలియ‌చేశారు.. ఏపీకి ఆదాయం త‌క్కువగా ఉన్నందున నిధులు ఇస్తున్నాం అని వెల్ల‌డించారు.
 
నాబార్డ్ నుంచి నిధులు ఇవ్వాల‌ని ఏపీ కోరింది.....రాజ‌కీయ అంశాల‌తో నిధులు రావు .....నేను ఏపీ ప‌ట్ల సానుకూలంగా ఉన్నాను అని తెలిపారు అరుణ్ జైట్లీ.. ఇక్క‌డ కేంద్రం ద‌గ్గ‌ర నిధులు వ‌ర‌ద పార‌డం లేదు....ప‌న్నులు తగ్గిస్తే ఇత‌ర రాష్ట్రాలు మాకు కావాలి అని అడుగుతాయి....సెంటిమెంట్ ఉంటే నిధులు ఇవ్వ‌డం కుద‌ర‌దు మిగ‌తా రాష్ట్రాలుగానే ఏపీని కూడా చూస్తున్నాం.. ఇక రాజ‌ధానికి ఇవ్వాల్సింది ఇచ్చేశాం అని తేల్చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.