టీడీపీకి గుడ్ బై

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-27 11:06:12

టీడీపీకి గుడ్ బై

తెలుగుదేశం త‌ర‌పున కేంద్ర‌మంత్రులుగా ఇరువురు  కొన‌సాగుతున్నారు.. అందులో ఒక‌రు అశోక్ గ‌జ‌ప‌తిరాజు మ‌రొక‌రు కేంద్ర‌మంత్రి సుజ‌నాచౌద‌రి.. ఇక ఇటీవ‌ల కేంద్రం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో తెలుగుదేశం డైల‌మాలో ఉంది. తెలుగుదేశం త‌ర‌పున ఉన్న ఇరువురిని వెన‌క్కి ర‌ప్పించాలి అని భావిస్తున్నారు తెలుగుదేశం అధినేత‌.. అయితే ఇటు సుజ‌నా మాత్రం దీనికి సుముఖంగా లేరు అనేది తెలిసిందే.
 
ఇక కేంద్ర‌మంత్రిగా ఉన్న సుజ‌నా చౌద‌రి తెలుగుదేశం త‌ర‌పున మంత్రిగా ఉన్నా, వ్యాపార రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్నారు.. ఈ స‌మ‌యంలో కేంద్రం నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే మ‌న పార్టీకి ఎంత మైన‌స్ కాకున్నా, ఆయ‌న‌కు మైన‌స్ అనే ఆలోచ‌న‌లో సుజ‌నా ఉన్నారు అనే మాట తెలుగుదేశం నాయ‌కులే చ‌ర్చిస్తున్నారు. ఇక వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం అనే కొత్త మాట‌ని తెరపైకి తీసుకువ‌చ్చింది.. ఇక వీరు అవిశ్వాసానికి స‌పోర్ట్ చేయ‌క‌పోతే తెలుగుదేశంలో చ‌రిత్ర హీనులుగా మిగిలిపోతారు అనే మాట కూడా వినిపిస్తోంది.. ఎంత కాలం కేంద్రాన్ని బ‌తిమ‌లాడుతారు అనే వెర్ష‌న్ వినిపిస్తోంది ప్ర‌జ‌ల నుంచి.
 
అయితే ఇటీవ‌ల ఓ వార్త హ‌స్తిన‌లో వైర‌ల్ అవుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం ఎటువంటి టికెట్ ఇవ్వ‌క‌పోయినా బీజేపీ త‌ర‌పున మీ కుటుంబంలో ఒక‌రికి టికెట్, మీకు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి అని గ‌తంలోనే అశోక్ గ‌జప‌తి రాజుకు ఆఫ‌ర్ ఇచ్చారు అమిత్ షా అనేది తెలిసిందే.. ఇదే వార్త అప్పుడు వైర‌ల్ అయింది.. అయితే ఆయ‌న బీజేపీలో చేరితే ఇది వెంట‌నే కుదిరే ఒప్పందం అని అన్నారు.
 
కేంద్ర మంత్రి రాజుగారి పై అవినీతి మ‌ర‌కలు లేవు అనేది తెలిసిందే.. అందుకే ఆ ప్ర‌జానాయ‌కుడి ని బీజేపీలోకి తీసుకుని పార్టీని ఉత్త‌రాంధ్రాలో పైకి తీసుకురావాలి అని బీజేపీ ఆలోచిస్తోంది.. పైగా మోదీ కేబినెట్లో మొద‌టి నుంచి ఉండ‌టం, ఆయ‌న‌కు పార్టీ త‌ర‌పున సిద్దాంతాల పై అవ‌గాహాన ఉండ‌టం, పార్టీకి మంచి జ‌రుగుతుంది అనే భావ‌న‌లో బీజేపీ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇటు జిల్లాల్లో గంటా సుజ‌య వంటి నాయ‌కుల‌తో  మ‌న‌కెందుకు అని, తెలుగుదేశం లో త‌న‌కు విలువ త‌గ్గుతోంది అని, అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఆలోచిస్తున్నార‌ట‌. అందుకే ఆయ‌న తెలుగుదేశానికి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతారు అని, ఆయ‌న కుమార్తెకు ఎంపీ సీటు ఇచ్చేలా బీజేపీ ముందుకు వ‌స్తోంది అనేదానిపై జిల్లాలో కూడా చ‌ర్చించుకుంటున్నారు ప్ర‌జ‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.