కేంద్రమంత్రి ఆస‌క్తిక‌రవ్యాఖ్యలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-26 18:10:22

కేంద్రమంత్రి ఆస‌క్తిక‌రవ్యాఖ్యలు

ఎన్డీయే నుంచి తెలుగుదేశం వెళ్లిపోవ‌డాన్ని తెలుగుదేశం నాయ‌కులు త‌మ‌కు ప్ర‌మాదం పొంచి ఉంది అనేలా భ‌య‌ప‌డుతున్నారు... ఏకంగా సీఎం చంద్ర‌బాబు కూడా త‌న‌కు ఏమైనా జ‌రిగినా వ‌ల‌యంలా ఉండి త‌న‌కోసం మీరు అండ‌గా ఉండాలి అని కోరుతున్నారు...
 
అయితే ఏ త‌ప్పు చేయ‌క‌పోతే ఇంత‌లా ప్ర‌జ‌ల సాయం దేనికి అడుగుతున్నారు..ఇక ఈయ‌న్నే కాపాడుకోలేని సీఎం రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌ను ఏం కాపాడ‌తారు అంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక తెలుగుదేశం ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు రావ‌డం బీజేపీ పై ప్ర‌ధానిపై తీవ్ర‌స్దాయిలో విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌ట్ల రాజ‌కీయంగా పెనుదుమారం లేస్తోంది.
 
ఇక ఎన్డీయే నుంచి తెలుగుదేశం క‌టీఫ్ చెప్ప‌డం ప‌ట్ల తెలుగుదేశం నాయ‌కులు పైకి చెప్ప‌లేని బాధ‌ను దిగమింగుతున్నారు, వారిలో అసంతృప్తి రోజు రోజుకు బీజేపీ పై చేసే విమ‌ర్శ‌ల్లో క‌నిపిస్తోంది.. ఇక తాజాగా 
వైసీపీపై కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా హాట్ టాఫిక్‌గా మారాయి.
 
ఓ వైపు ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగడం తొందరపాటు చర్య అంటూనే.. మరోవైపు వైసీపీ రాకపై సానుకూలంగా స్పందించారు. వైసీపీ అధినేత జగన్‌ ఎన్డీయేతో కలిస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జగన్‌పై ఉన్న కేసుల గురించి ప్రస్తావిస్తూ.. జగన్‌పై ఉన్న కేసుల్లో ఏవీ ఇంకా నిరూపితం కాలేదని రాందాస్‌ అథవాలే చెప్పుకొచ్చారు.
 
ఇక దీనిని కూడా తెలుగుత‌మ్ముళ్లు లోప‌కారి ఒప్పందం అంటున్నారు... నాడు బీజేపీతో క‌ల‌వ‌ను అన్న చంద్ర‌బాబు 2014 ఎన్నిక‌ల్లో అధికారం కోసం మోదీ వెంట వెళ్లారు... ఇక కాంగ్రెస్ కు ర‌హ‌స్యంగా సాయం చేస్తున్నారు అనే విమ‌ర్శ‌లు నేడు వినిపిస్తున్నాయి... ఇక ఇలాంటి రాజ‌కీయం చంద్ర‌బాబుకు మాత్ర‌మే తెలుసు అని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు...
 
బాబు రాజ‌కీయం గురించి రాష్ట్రంలో ఎలా ఉన్నా దేశంలో అంద‌రూ ఎలా చ‌ర్చించుకుంటారో, అలాగే బాబుకు విలువ ఎంత ఇస్తారో మొన్న‌పార్ల‌మెంట్లో చూసిన సాక్ష్యాలే నిద‌ర్శ‌నాలు అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ఇటు క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో కూడా బీజేపీకి ఓట్లు వెయ్య‌ద్దు అని బాబు చెప్ప‌డం, తెలుగుదేశం నాయ‌కులు అక్క‌డ చేస్తున్న పొలిటిక‌ల్ స్టంట్లు అన్ని బీజేపీ అబ్జ‌ర్వ్ చేస్తోంద‌ట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.