కేంద్రం చేతులెత్తేసిందా?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-28 01:00:29

కేంద్రం చేతులెత్తేసిందా?

ఇటీవ‌ల కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు ఆవేద‌న చెందుతూ విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలు, ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించాల‌ని కేంద్రం పై పోరాటం చేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో  సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదా రావ‌డం వ‌ల్ల ఏపీకి ఏమి వ‌స్తాయ‌ని ప్ర‌శ్నించి రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేశారు... హోదా రావ‌డం వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌ల‌కు రాయితీలు వ‌స్తాయ‌ని ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నారంటు ప్ర‌తిప‌క్షాల‌ను విమ‌ర్శించారు. 
 
ప్ర‌త్యేక హోదా వ‌ల్ల రాయితీలు వ‌స్తాయ‌ని చేప్పేవారు ఏదైనా జీవో ఉంటే చూపించాల‌ని కోరారు. అది లేక‌పోవ‌డం వ‌ల్లేత‌మ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప్యాకేజిని అంగిక‌రించామ‌ని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్లు కావాలని, లోటు బడ్జెట్‌ కింద రూ.16 వేల కోట్లు రావాలని, ఇవన్నీ హోదా వల్ల రావన్నారు చంద్ర‌బాబు... హోదా రావ‌డం వ‌ల్ల ఏమి వ‌స్తాయ‌ని ప్ర‌శ్నించిన చంద్ర‌బాబు, ఇతర రాష్ట్రాలకు హోదా కొనసాగిస్తున్నప్పుడు తమకు ఎందుకు ఇవ్వ‌కూడ‌ద‌ని కేంద్రాన్ని అడగ‌డం విశేషం.
 
ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌లు భూస్థాపితం చేశార‌ని,  ప్ర‌స్తుతం బీజేపీ కూడా అదేవైపు అడుగులు వేయ‌డం ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని అన్నారు. ప్ర‌స్తుతం కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉందని, సంకీర్ణ ప్రభుత్వం ఉండి ఉంటే కొంత ఒత్తిడి చేయడానికి అవకాశం ఉండేదన్నారు.ఇప్పుడు కేంద్రానికి  వ్య‌తిరేకంగా పోరాటం చేస్తే రాష్ట్రానికి న‌ష్టం త‌ప్ప, లాభం లేద‌ని వివ‌రించారు.
 
పారిశ్రామిక స‌ద‌స్సులు ఏర్పాటు చేసుకుని పెట్టుబ‌డులు సాధించుకుంటున్న ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకని బీజేపీ నాయకులు కొందరు అడుగుతున్నారని, అది సరికాదని అన్నారు. పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని కేంద్రం త‌న బాధ్య‌త‌ను విస్మ‌రిస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు లేవని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదని అన్నారు చంద్ర‌బాబు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.