ఏపీ బీజేపీ నాయ‌కుల‌కు అధిష్టానం క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ap bjp leaders meeting image
Updated:  2018-03-07 05:02:37

ఏపీ బీజేపీ నాయ‌కుల‌కు అధిష్టానం క్లారిటీ

ఏపీ రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి....  నిమిషానికి ప‌దుల సంఖ్య‌లో సంచ‌ల‌న నిర్ణ‌యాలు- ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డుతున్నాయి... దేశీయ రాజ‌కీయ పార్టీలు అన్నీ  ఏపీ వైపే చూస్తున్నాయి.  దీనికి కార‌ణం రాష్ట్ర‌విభ‌జ‌న త‌ర్వాత అమ‌లు చేయాల్సిన విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలు ముఖ్య అంశం అయితే , ఇక ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం అనుస‌రిస్తున్న‌తీరు పై ప‌లు రాజ‌కీయ పార్టీలు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న తీరు మ‌న‌ అంద‌రికి తెలిసిందే. దీని పై ఇరు పార్టీలు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి. ఇక్క‌డ ప్ర‌ధాన‌మ‌యిన అంశం, ఏపీ ప్ర‌భుత్వం కేంద్ర ప్ర‌భుత్వంతో భాగ‌స్వామిగా ఉండ‌డం. 
 
తాజాగా ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో బీజేపీఎల్పీ స‌మావేశం ఏర్పాటు చేశారు క‌మ‌లం పార్టీ నాయ‌కులు. ఈ స‌మావేశానికి బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్య‌క‌ర్త‌లంద‌రూ హ‌జ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌ధానంగా బీజేపీ అనుస‌రించాల్సిన వ్యూహం పై చర్చించారు... ఒక‌వేళ సీఎం చంద్ర‌బాబు బీజేపీ పై ఆరోప‌ణ‌లు చేస్తే, ఏ విధంగా వాటిపై స్పందించాలి అలాగే వాటికి స‌మాధానం ఎలా ఇవ్వాలి అనే  దాని పై స‌మాలోచ‌న‌లు చేశార‌ట కాషాయ పార్టీ  నాయ‌కులు. 
 
టీడీపీ తో తాడోపేడో తేల్చుకోవ‌డానికి సిద్దం అయ్యారు బీజేపీ  నేత‌లు... బీజేపీ మంత్రుల రాజీనామాల పై లాబీలో చ‌ర్చించారు... పోత్తు పై టీడీపీ తెగ‌దెంపులు చేసుకోక‌ముందే బీజేపీ మంత్రులు రాజీనామా చేస్తారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.. రాజీనామాల‌కు సిద్దం కావాల‌ని బీజేపీ హైక‌మాండ్ నుంచి ఎమ్మెల్యేల‌కు ఆదేశాలు ఇప్ప‌టికే అందాయి అని తెలుస్తోంది.. రాష్ట్ర అభివృద్ది విష‌యంలో టీడీపీ మ‌మ్మ‌ల్ని నిందిస్తే  చూస్తూ ఉరుకొమ‌ని దానికి దీటైన జ‌వాబులు ఇవ్వ‌డానికి సిద్దం అయ్యామ‌ని  బీజేపీ ఎమ్మెల్యేలు అన్నారు.. బీజేపీని నిందించి టీడీపీ ల‌బ్దిపొందాల‌ని చూస్తే ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు.. ఏపీకి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల‌ కంటే ఎక్కువ నిధులు కేటాయించామ‌ని వారు అన్నారు.
 
మ‌రో వైపు ఏపీ బీజేపీ నాయ‌కుల‌కు దిల్లీ రావాల‌ని అమిత్‌షా నుంచి పిలుపు వ‌చ్చింది. రేపు ఏపీ బీజేపీ నాయ‌కుల‌తో అమిత్ షా భేటికానున్నారు... ఈ భేటిలో టీడీపీతో పోత్తు, భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ పై చ‌ర్చిస్తార‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.