లోకేశ్ కు స్కెచ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-24 17:49:32

లోకేశ్ కు స్కెచ్

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు మంత్రి లోకేశ్ కు కేంద్రం గ‌ట్టి షాక్ ఇవ్వ‌నుంద‌ని కొంద‌రు పార్టీ నేత‌లే  చ‌ర్చించుకుంటున్నారు.. గ‌త కొద్దికాలంగా తెలుగు దేశం పార్టీ నాయ‌కులు... కేంద్ర వైఖ‌రిని నిర‌సిస్తున్న తీరు మ‌నంద‌రికి తెలిసిందే, అలాగే కేంద్రంలో ఉన్న ఎన్డీయే పై  అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగ‌తి తెలిసిందే.
 
అయితే ఈ క్ర‌మంలో వారు పెట్టిన‌ తీర్మానంపై కేంద్రం సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది... దీంతో రాష్ట్రంలో జ‌రిగిన విభేదాల‌ను అలాగే లోకేశ్ అవినీతి అక్ర‌మాలకు సంబంధించి పూర్తి ఆధారాల‌ను సేక‌రించే ప‌నిలో ప‌ట్టు బిగిస్తోంద‌ని తాజా విశ్లేష‌కుల స‌మాచారం..
 
అందులో భాగంగానే మొన్న‌టికి మొన్న జ‌న‌సేన అధినేత  ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా చెన్నైకు చెందిన టీడీపీ బోర్డ్ మాజీ స‌భ్యుడు శేఖ‌ర్ రెడ్డి అవినీతిలో లోకేశ్ కు కూడా సంబంధం ఉందని ప్లీన‌రీ సాక్షిగా కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు ప‌వ‌న్.. దీంతో టీడీపీ నాయ‌కులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న అక్ర‌మాలు గుట్టు ర‌ట్టు కావ‌డంతో ఈ విష‌యంపై కేంద్రం సీరియ‌స్ గా తీసుకుంది... దీంతో పాటు రాష్ట్ర  వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన అగ్రిగోల్డ్ స్కామ్ లో కూడా లోకేశ్ పాత్ర కీల‌క‌మైన‌ద‌ని భావించి, దీని పై కేంద్రం ఇన్వెస్ట్ గేష‌న్ ముమ్మ‌రంగా సాగిస్తోంది.
 
ఈ ఇన్వేస్ట్ గేష‌న్ పూర్తి అయిన తర్వాత ప‌క్కా ఆధారాల‌తో మంత్రి లోకేశ్  పై స్కెచ్ రూపొందించనున్నారు అని తాజా రాజ‌కీయ విశ్లేష‌కుల భావ‌న‌.. ఇందుకోసం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీకి అత్యంత స‌న్నిహితులే ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన‌ట్లు తెస్తోంది.  కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యం స‌క్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ త‌రపున పోటీ చేసే అభ్య‌ర్థులకు రానున్న‌ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో డిపాజిట్లు కూడా రాకుండా చేయాల‌ని కేంద్రం ఆలో చేస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు  భావిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.