చంద్ర‌బాబు A2 ముద్దాయి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-07 15:11:08

చంద్ర‌బాబు A2 ముద్దాయి

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించాలంటూ నాలుగు సంవ‌త్స‌రాలుగా నిర్విరామంగా చేస్తున్న వైసీపీ పోరాటం ఆఖ‌రి ఘ‌ట్టానికి చేరుకుంది. పార్ల‌మెంట్ చివ‌రి రోజున నిర‌వ‌ధిక వాయిదా ప‌డ‌డంతో పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్  ఆదేశానుసారం ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన ప‌త్రాల‌ను స్పీక‌ర్ సుమిత్రా మ‌హ‌జాన్‌కు స‌మ‌ర్పించి... దిల్లీలో ఉన్న ఏపీ భ‌వ‌న్‌లో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్న విష‌యం అంద‌రికి తెలిసిందే. 
 
ప్ర‌త్యేక‌హోదా కోసం వైసీపీ ఎంపీలు చేస్తున్న ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు ప‌లువురు నేత‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఈ దీక్ష‌కు ప్రత్యేక హోదా సాధన సమితి, ఆంధ్ర మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్  సంఘీభావం తెలిపారు. ఈ సంద‌ర్బంంగా మాట్లాడిన చలసాని శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకుండా పోవడంలో ఏ1 ముద్దాయి కేంద్రమైతే, ఏ2 ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వమని ఆరోపించారు. హోదా కోసం వైసీపీ నిజాయితీగా పోరాటం చేస్తోంద‌ని అన్నారు.  సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదాపై మూడుసార్లు యూటర్న్‌ తీసుకున్న విధానాన్ని ఆయన గుర్తుచేశారు.
 
2014 మే 26న కేంద్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రూ.లక్షల కోట్లు వచ్చి ఉండేవని అన్నారు. హోదా రాకపోవడం వల్ల రాష్ట్రం రూ.లక్షల కోట్లు నష్టపోయిందని తెలిపారు.ప్ర‌త్యేక‌ హోదా కోసం పోరాటం చేసిన వాళ్ల‌ను జైళ్ల‌లో పెట్టించిన ఘ‌న‌త సీఎం చంద్ర‌బాబుద‌ని అన్నారు. విభ‌జ‌న హ‌మీల‌ను సాధించుకోవ‌డం కోసం ఒక క‌మిటిని ఏర్పాటు చేయాల‌ని కోరినా ప‌ట్టించుకోలేద‌ని అన్నారు. రూ.73,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఉన్నాయని చెబితే ఒక్క రూపాయి కూడా రాబట్టుకోలేకపోయారు. కోర్టు చెప్పినా జరగలేదు. ప్రత్యేక హోదా సంజీవని కాదంటారు.అమరావతిని పారదర్శకంగా నిర్మించాలని కోరితే అభివృద్ధి నిరోధకులు అంటున్నారని విమ‌ర్శించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.