జ‌గ‌న్ తో చ‌ల‌సాని భేటీ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-04 17:48:28

జ‌గ‌న్ తో చ‌ల‌సాని భేటీ ?

గుంటూరు జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతోంది.. గుంటూరు టౌన్ లో ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిశారు హూదా సాధ‌న క‌మిటీ నేత‌లు.. ఏపీకి ప్ర‌త్యేక హూదా కోసం అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నార‌ని ముందు నుంచి ఒకే స్టాండ్ పై నిలిచింది వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అని నేత‌లు జ‌గ‌న్ పై ప్ర‌శంస‌లు కురిపించారు.
 
కేంద్రం పై అవిశ్వాసం పెట్టిన మొద‌టిపార్టీ వైసీపీ అని జ‌గ‌న్ కు కొనియాడారు.. వైసీపీ నేత‌లు ఎంపీలు దిల్లీలో దీక్ష చేయ‌డం అలాగే కేంద్రం పై పోరాటం చేయ‌డం ఏపీ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు అని వారు తెలియ‌చేశారు. మొద‌టి నుంచి వైసీపీ కేంద్రం పై పోరాటం చేయాలి అని తెలుగుదేశానికి తెలియ‌చేసింది, చివ‌ర్లో మేల్కొన్న తెలుగుదేశం పై ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు ఎక్కువ అయ్యాయిని వారు తెలియ‌చేశారు.
 
ఏపీలో అన్ని రాజ‌కీయ పార్టీల‌ను క‌లుపుకొని ఏపీకి ప్ర‌త్యేక హూదా సాధ‌నే ల‌క్ష్యంగా ముందుకు వెళ్లాలి అని జ‌గ‌న్ ను వారు కోరారు... దీనికి జ‌గ‌న్ సుముఖ‌త చూపించారు... ఏపీకి ప్ర‌త్యేక హూదా కోసం చివ‌రి వ‌ర‌కూ పోరాటం చేస్తామ‌ని తెలియ‌చేశారు జ‌గ‌న్.. ఇక దిల్లీలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేయ‌బోయే ఎంపీల‌కు త‌మ మ‌ద్ద‌తు ఉంటుంది అని చ‌ల‌సాని శ్రీనివాస్ మిగిలిన హూదా సాధ‌న క‌మిటిస‌భ్యులు తెలియ‌చేశారు. త్వ‌ర‌లో మ‌రోసారి క‌మిటీ నేత‌ల‌తో చ‌ర్చించి మ‌రింత ముందుకు తీసుకువెళ‌తాం అని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వారికి భ‌రోసా ఇచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.